హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SECL Recruitment 2022: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలిలా..

SECL Recruitment 2022: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

SECL Recruitment 2022: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) ఉద్యోగాల భర్తీకి సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. మైన్ సర్వేయర్ టీ అండ్ ఎస్, గ్రేడ్-B, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) ఉద్యోగాల భర్తీకి సంస్థ నోటిఫికేషన్(Notification) జారీ చేసింది. మైన్ సర్వేయర్ టీ అండ్ ఎస్, గ్రేడ్-B, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో పనిచేసే వారి కోసం(Internal Workers) కేటాయించబడ్డాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://secl-cil.in/index.phpను సందర్శించి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకొని.. హార్డ్ కాపీని జూలై 21, 2022 వరకు  సమర్పించవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడవచ్చు. హార్డ్ కాపీతో పాటు.. అర్హత గల డాక్యుమెంట్లను(Documents) జత చేసి నోటిఫికేషన్ లో పేర్కొన్న అడ్రస్ కు పంపించాలి. లేదంటే.. persnee.secl@coalindia.in మెయిల్ కు పంపించవచ్చని పేర్కొన్నారు.

TS TET Marks: టెట్ ఫలితాల్లో గందరగోళం.. ఆందోళనలో అభ్యర్థులు.. కారణం ఏంటంటే..


SECL, CIL క్రింద ఉన్న వివిధ డిపార్ట్‌మెంటల్ ఆర్గనైజేషన్‌లతో పనిచేస్తున్న కార్మికులు మరియు CIL ప్రధాన కార్యాలయం, కోల్‌కతాలోని కార్మికులు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 133 ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.  దరఖాస్తుల ప్రక్రియ 6 జూలై 2022 నుంచి ప్రారంభమయ్యాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ తేదీ 21జూలై 2022గా పేర్కొన్నారు.

మైన్ సర్వేయర్ T&S గ్రేడ్-B పోస్టులు 45, ఉద్యోగుల నర్స్ టీ అండ్ ఎస్  గ్రేడ్-C  పోస్టులు 59, ఫార్మసిస్ట్ T&S గ్రేడ్-C 10, టెక్నీషియన్ (పాథలాజికల్) T&S గ్రేడ్-సి 8, Jr టెక్ ECG T&S గ్రేడ్-D 4, టెక్/ రేడియోగ్రాఫర్ T&S గ్రేడ్-C పోస్టులు 1, టెక్నీషియన్ ఆప్టోమెట్రీ T&S గ్రేడ్-డీ పోస్టులు 6 ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 133 పోస్టులను భర్తీ చేస్తారు.  అభ్యర్థులు 10/డిప్లొమా/ నర్సింగ్ కలిగి ఉండాలి. అంతే కాకుండా.. ఆ సంస్థలో పని చేస్తూ ఉండాలి.

పరీక్షా విధానం..

అభ్యర్థులు మొత్తం 100 మార్కుల కోసం రాత పరీక్షకు హాజరు కావాలి. పరీక్షలో 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఒక్కొక్కటి 01 మార్కులను కలిగి ఉంటాయి. వాటిలో జనరల్, బీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు, SC/ST కేటగిరీ అభ్యర్థులు రాత పరీక్షలో 35 శాతం మార్కులు వస్తే అర్హత సాధించినట్లుగా పేర్కొన్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Students, Workers

ఉత్తమ కథలు