SEBI Jobs: గుడ్ న్యూస్... 147 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SEBI Jobs: గుడ్ న్యూస్... 147 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)

SEBI Recruitment 2020 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

  • Share this:
    భారతీయ స్టాక్ మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జనరల్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్‌లో గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది సెబీ. మొత్తం 147 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 మార్చి 7న ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sebi.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    SEBI Recruitment 2020: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 147
    జనరల్- 80
    లీగల్- 34
    ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 22
    ఇంజనీరింగ్- 5
    రీసెర్చ్- 5
    అఫీషియల్ లాంగ్వేజ్- 1

    SEBI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 7
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 23
    ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 ఏప్రిల్ 12
    ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 మే 3
    ఫేజ్ 3 ఇంటర్వ్యూ- ఫేజ్ 2 ఫలితాల తర్వాత వెల్లడించనున్న సెబీ
    విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
    వయస్సు- 2020 ఫిబ్రవరి 29 నాటికి 30 ఏళ్లు.
    ఎంపిక విధానం- ఫేజ్ 1, ఫేజ్ 2 ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ.
    పరీక్షా కేంద్రాలు- ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్, రాజమండ్రి, గుంటూరు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్.
    దరఖాస్తు ఫీజు- అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు

    Telangana Jobs: సిమెంట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో 122 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published: