Govt Jobs: సెబీలో ఉద్యోగాలకు మరోసారి దరఖాస్తు గడువు పెంపు

SEBI Recruitment 2020 | ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటున్నవారికి శుభవార్త. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI 147 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

news18-telugu
Updated: May 29, 2020, 9:28 AM IST
Govt Jobs: సెబీలో ఉద్యోగాలకు మరోసారి దరఖాస్తు గడువు పెంపు
Govt Jobs: సెబీలో ఉద్యోగాలకు మరోసారి దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. భారతీయ స్టాక్ మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే ఓసారి దరఖాస్తు గడువును పొడిగించింది. ఏప్రిల్ 30న దరఖాస్తు గడువు ముగియడంతో కరోనా వైరస్ సంక్షోభం కారణంగా మే 31 వరకు పొడిగించింది. కానీ కరోనావైరస్ లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో మరోసారి దరఖాస్తు గడువును పెంచుతూ అభ్యర్థులకు మరో అవకాశాన్ని ఇచ్చింది. ఈసారి ఏకంగా జూలై 31 వరకు చివరి తేదీని పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులకు మరో రెండు నెలలు అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 147 పోస్టుల్ని భర్తీ చేస్తోంది సెబీ. జనరల్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్‌లో గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sebi.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

SEBI Recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 147
జనరల్- 80
లీగల్- 34
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 22
ఇంజనీరింగ్- 5రీసెర్చ్- 5
అఫీషియల్ లాంగ్వేజ్- 1

SEBI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 31
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- 2020 ఫిబ్రవరి 29 నాటికి 30 ఏళ్లు.
ఎంపిక విధానం- ఫేజ్ 1, ఫేజ్ 2 ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ.
పరీక్షా కేంద్రాలు- ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్, రాజమండ్రి, గుంటూరు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్.
దరఖాస్తు ఫీజు- అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు తేదీ పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డీఆర్‌డీఓలో 185 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు

Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో జాబ్స్... మే 31 చివరి తేదీ

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
Published by: Santhosh Kumar S
First published: May 29, 2020, 9:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading