Home /News /jobs /

SEBI RECRUITMENT 2020 SECURITIES AND EXCHANGE BOARD OF INDIA EXTENDS APPLICATION DEADLINE FOR 147 POSTS TILL MAY 31 SS

Govt Jobs: సెబీలో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

Govt Jobs: సెబీలో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
(ప్రతీకాత్మక చిత్రం)

Govt Jobs: సెబీలో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)

SEBI Recruitment 2020 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సెబీ దరఖాస్తు గడువును పొడిగించింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

    భారతీయ స్టాక్ మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 30 చివరి తేదీ. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ షార్ట్ నోటీస్ విడుదల చేసింది సెబీ. ఆసక్తి గల అభ్యర్థులు 2020 మే 31 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా 147 పోస్టుల్ని భర్తీ చేస్తోంది సెబీ. జనరల్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్‌లో గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sebi.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    SEBI Recruitment 2020: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 147
    జనరల్- 80
    లీగల్- 34
    ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 22
    ఇంజనీరింగ్- 5
    రీసెర్చ్- 5
    అఫీషియల్ లాంగ్వేజ్- 1

    SEBI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 7
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 31
    ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 జూలై 4
    ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 ఆగస్ట్ 23
    ఫేజ్ 3 ఇంటర్వ్యూ- ఫేజ్ 2 ఫలితాల తర్వాత వెల్లడించనున్న సెబీ
    విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
    వయస్సు- 2020 ఫిబ్రవరి 29 నాటికి 30 ఏళ్లు.
    ఎంపిక విధానం- ఫేజ్ 1, ఫేజ్ 2 ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ.
    పరీక్షా కేంద్రాలు- ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్, రాజమండ్రి, గుంటూరు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్.
    దరఖాస్తు ఫీజు- అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు తేదీ పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Jobs: డిగ్రీ, బీటెక్, పీజీ అర్హతతో జాబ్స్... దరఖాస్తు గడువు పొడిగింపు

    HPCL Jobs: హెచ్‌పీసీఎల్‌లో జాబ్స్... దరఖాస్తుకు ఏప్రిల్ 24 చివరి తేదీ

    Railway Jobs: రైల్వేలో 617 జాబ్స్... రేపే లాస్ట్ డేట్
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Central Government, Exams, Job notification, JOBS, NOTIFICATION, Sebi

    తదుపరి వార్తలు