Home /News /jobs /

SEAT IN IIMS WITHOUT CAT EXAM JUST DO THESE COURSES SEAT GUARANTEED UMG GH

IIMs Courses: క్యాట్ ఎగ్జామ్ లేకుండానే ఐఐఏంలో సీట్.. ఈ కోర్సులు చేస్తే చాలు.. సీట్ గ్యారెంటీ !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)లలో చదవడం చాలా మంది విద్యార్థుల(Students) కల. ఐఐఎంలలో అడ్మిషన్ పొందాలంటే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) క్వాలిఫై కావడం ఏకైక మార్గమని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అయితే దేశంలోని కొన్ని టాప్ బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశం పొందటానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)లలో చదవడం చాలా మంది విద్యార్థుల కల. ఐఐఎంలలో అడ్మిషన్ పొందాలంటే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) క్వాలిఫై కావడం ఏకైక మార్గమని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అయితే దేశంలోని కొన్ని టాప్ బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశం పొందటానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. కొన్ని బిజినెస్ స్కూల్స్ ఆన్‌లైన్ కోర్సులు(Courses), షార్ట్- టర్మ్ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. కోర్సెరా(Coursera) ఇడిఎక్స్(edX) వంటి ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు ఐఐఎంల అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించడం ద్వారా ఈ కోర్సుల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఐఐఎం కోజికోడ్- బిజినెస్ మేనేజ్‌మెంట్
బిజినెస్‌లో సమర్థవంతమైన వ్యూహాలు, సంస్థాగత వృద్ధి కోసం బిజినెస్(Business) లీడర్‌షిప్ స్కిల్స్, టెక్నిక్స్ వంటి విధానాలను ఈ ప్రోగ్రామ్ ద్వారా అభ్యర్థులు నేర్చుకుంటారు. అనాలిసిస్, డెసిషన్ మేకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, సేల్స్ వంటి అంశాలపై ఈ కోర్సు ద్వారా దృష్టిసారించవచ్చు. సెల్ఫ్ ఫేస్డ్‌తో ఈ కోర్సు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. అయితే అభ్యర్థులు రూ.1,87,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఐఐఎం కోజికోడ్ లైవ్ ఆన్‌లైన్ సెషన్స్‌తోపాటు ఐదు రోజుల క్యాంపస్ సందర్శన కూడా ఉంటుంది.

ఐఐఎం లక్నో- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ బిజినెస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాడక్ట్స్, సర్వీసెస్, ప్రాసెస్‌ల‌పై ఆసక్తి ఉన్న ప్రొఫెషనల్స్ కోసం ఐఐఎం లక్నో ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. WileyNXTతో కలిసి డెవలప్ చేసిన ఈ ప్రోగ్రామ్‌ సెప్టెంబర్ 4న ప్రారంభం కానుంది. యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం స్కోర్‌తో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఆరు నెలల ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్.

జిప్‌మ్యాట్
ఇండియాలో టాప్ ఇన్‌స్టిట్యూట్స్ ఆన్‌లైన్ కోర్సులతో పాటు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (IPM)ను ఆఫర్ చేస్తున్నాయి. 12వ తరగతి తర్వాత ఈ ప్రోగ్రామ్స్ చేయవచ్చు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను మేనేజ్‌మెంట్‌లో BBA ప్లస్ MBA డిగ్రీని అభ్యసించవచ్చు. సంవత్సరానికి ఐదు మూడు టర్మ్‌లలో రెండు డిగ్రీలను కూడా పొందవచ్చు. ఐఐఎం జమ్మూ- బోధ్ గయా- రోహ్‌తక్- ఇండోర్ సంస్థలు ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో ప్రవేశం పొందాలంటే జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ టెస్ట్ (జిప్‌మ్యాట్) క్వాలిఫై కావడం తప్పనిసరి.

ఇదీ చదవండి: Success Story: జేజేఈ మెయిన్ టాపర్‌గా అసోం అమ్మాయి.. ప్రిపరేషన్‌లో ఆమె చెప్తున్న మాటలు వింటే మైండ్ పోద్ది !


ఐఐఎం బెంగళూరు - అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్
ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ బెటర్‌గా అర్థం చేసుకోవడానికి.. అసెట్ మేనేజ్‌మెంట్, కాస్ట్ మేనేజ్‌మెంట్, ట్యాక్స్ మేనేజ్‌మెంట్ వంటి ప్రాథమిక అంశాల ద్వారా వ్యాపార పనితీరు ఎలా ప్రభావితమవుతుందో అంచనా వేయడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ కావచ్చు. రూ. 11,172 ఫీజుగా చెల్లించాలి. ఈ కోర్సు edXలో అందుబాటులో ఉంది.



ఐఐఎం రోహ్‌తక్- స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సును అందిస్తున్న తొలి ఇన్‌స్టిట్యూట్ ఐఐఎం రోహ్‌తక్. స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ రంగంలో లీడర్స్‌గా ఎదగటానికి ఆసక్తిగా ఉన్న ఎక్స్‌పీరియన్స్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్, క్రీడా ఔత్సాహికులు, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండేళ్ల ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందాలంటే, అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 50 శాతం లేదా అందుకు సమానమైన మొత్తం గ్రేడ్ పాయింట్ యావరేజ్‌ను పొంది ఉండాలి
Published by:Mahesh
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు