Home /News /jobs /

SCIENTIST POSTS IN CCMB HYDERABAD KNOW ELIGIBILITY EVK

CCMB Hyderabad: సీసీఎంబీ హైద‌రాబాద్‌లో సైంటిస్ట్ ఉద్యోగాలు

సీసీఎంబీ జాబ్స్

సీసీఎంబీ జాబ్స్

సెంట‌ర్ ఫ‌ర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బ‌యోలజీ (Centre for Cellular and Molecular Biology) హైద‌రాబాద్‌లో సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అక్టోబర్ 11, 2021 వరకుఅవకాం ఉంది.

ఇంకా చదవండి ...
    సెంట‌ర్ ఫ‌ర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బ‌యోలజీ (Centre for Cellular and Molecular Biology) హైద‌రాబాద్‌లో సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా సైంటిస్ట్‌, సీనియ‌ర్ సైంటిస్ట్‌ (Senior Scientist), సీనియ‌ర్ ప్రిన్సిప‌ల్ సైంటిస్ట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ సెప్టెంబ‌ర్ 20, 2021 నుంచి ప్రారంభమై అక్టోబ‌ర్ 11, 2021 వ‌రకు కొన‌సాగుతుంది. ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకొన్న‌ హార్డు కాపీ (Hard copy)ల‌ను అక్టోబ‌ర్ 19 వ‌ర‌కు కొన‌సాగుతుంది. అభ్య‌ర్థుల సౌక‌ర్యం కోసం ద‌ర‌ఖాస్తు ఫీజు కేవ‌లం రూ.100 మాత్ర‌మే నిర్ణ‌యించింది. ద‌ర‌ఖాస్తు చేసుకోనే ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు వ‌యోప‌రిమితి స‌డ‌లింపు ఉండ‌నుంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌, అర్హ‌త‌ల వివ‌రాలు తెలుసుకోవ‌డానికి చ‌ద‌వండి.

    అర్హతలు.. ఖాళీల వివరాలు























    పోస్టు పేరుఅర్హతలుఖాళీల వివరాలు
    సైంటిస్ట్ లైఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. రీసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.  వయోపరిమితి 32 ఏళ్లు మించి ఉండకూడదు.01
    సీనియర్ సైంటిస్ట్లైఫ్ సైన్స్‌ (Life Science)లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 37 ఏళ్లు మించి ఉండకూడదు.05
    సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్లైఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ (PhD) పూర్తి చేసి ఉండాలి.   ఆరేళ్ల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 50 ఏళ్లు మించి ఉండకూడదు.02

    TTD Jobs: టీటీడీ, బీఐఆర్ఆర్‌డీ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఉద్యోగాలు..


    ఎంపిక విధానం..
    - ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌లో కొంద‌రిని షార్ట్ లిస్ట్ (Short list) చేస్తారు.
    - అభ్య‌ర్థుల అనుభ‌వం, అకాడ‌మిక్ సామార్థ్యాల ఆధారంగా షార్ట్ లిస్ట్ ప్ర‌క్రియ ఉంటుంది.
    - షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూ (Interview)లు నిర్వ‌హిస్తారు.

    ద‌ర‌ఖాస్తు విధానం.
    Step-1 :  అభ్య‌ర్థి ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అధికారి వెబ్‌సైట్ https://www.ccmb.res.in/Careers/Regular-Positions ను సంద‌ర్శించాలి.
    Step-2 :  అనంత‌రం నోటిఫికేష‌న్‌లో వివ‌రాలు పూర్తిగా చ‌ద‌వాలి.
    Step-3 :  అందులో అర్హ‌త ఉన్న పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనేంద‌కు పేజీ కింద "Click for apply online" ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.
    Step-4 :  అనంత‌రం ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి.
    Step-5 :  నింపిన ద‌ర‌ఖాస్తును ప్రింట్ తీసుకొని అవ‌స‌ర‌మైన ధ్రువ‌ప‌త్రాల‌ను జ‌త చేసి కింది అడ్ర‌స్‌కు పంపాలి.
    "Section Officer
    (Recruitment), CSIR-Centre for Cellular and Molecular Biology,
    Uppal Road,
    Habsiguda,
    Hyderabad – 500007,
    Telangana"
    Step-6 :  ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 11, 2021
    Step-7 :  హార్డ్ కాపీ పోస్టు చేరేందుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 19, 2021
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, Jobs in telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు