స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారో చెప్పిన కేంద్ర మంత్రి...

ఆగస్ట్ 15 తర్వాత స్కూళ్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే స్కూళ్లను ముందుగా ఓపెన్ చేయనున్నారు.

news18-telugu
Updated: June 7, 2020, 2:35 PM IST
స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారో చెప్పిన కేంద్ర మంత్రి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మార్చి మధ్య నుంచి స్కూళ్లు మూతపడ్డాయి. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారనే అంశంపై అటు విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు కూడా సందిగ్ధంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో స్కూళ్లు ఎప్పుడు ఓపెన్ చేస్తామో చెప్పారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్. ఆగస్ట్ తర్వాతే స్కూళ్లు ఓపెన్ చేస్తామని చెప్పినట్టు ఇండియాటుడే కథనాన్ని ప్రచురించింది. జూన్ 3న జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెప్పింది. దేశవ్యాప్తంగా సుమారు 33 కోట్ల మంది విద్యార్థులు స్కూళ్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారా? అని గందరగోళంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5 సందర్భంగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జూలైలో స్కూళ్లు రీ ఓపెన్ చేసే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. కేవలం 33 శాతం అటెండెన్స్‌తో స్కూళ్లు నిర్వహించే అవకాశం ఉంది. అది కూడా 8 కంటే చిన్న తరగతుల వారిని మినహాయించి, ఆ పైన విద్యార్థులకు మాత్రమే స్కూళ్లు నిర్వహించే చాన్స్ ఉంది. మిగిలిన వారు ఇంటి వద్దే ఉండక తప్పదు. రెండు సెషన్లలో స్కూళ్లు నిర్వహిస్తారు. మార్నింగ్ ఒక బ్యాచ్, మధ్యాహ్నం మరో బ్యాచ్ విద్యార్థులు క్లాసులకు హాజరయ్యేలా ప్రణాళికలు వేస్తున్నారు. అలాగే, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే స్కూళ్లను ముందుగా ఓపెన్ చేయనున్నారు. బహుశా ఆగస్ట్ 15 తర్వాత స్కూళ్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. మరోవైపు వచ్చే విద్యాసంవత్సంలో 30 శాతం సిలబస్‌ను తగ్గించాలంటూ ఇటీవల ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ప్రతిపాదించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 7, 2020, 2:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading