Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి స్కూళ్లు.. విద్యార్థులు హాజరయ్యేది ఎప్పటి నుంచి అంటే..

నేటి నుంచి ఏపీలో స్కూళ్లు

ఏపీలో విద్యార్థుల తల్లి దండ్రులకు శుభవార్త.. నేటి నుంచి ప్రభుత్వ స్కూళ్లు తెరుచుకోనున్నాయి. అయితే ప్రస్తుతానికి కేవలం టీచర్లు మాత్రమే హాజరవ్వాల్సి ఉంది. విద్యార్థులను ఎప్పటి నుంచి పాఠశాలలకు అనుమతించాలి అన్నదానిపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

  • Share this:
    ఏపీపై కరోనా ప్రభావం కాస్త తగ్గింది. రోజు రోజుకూ కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. దాదాపు 8 జిల్లాల్లో పాజిటివ్ రేట్ 5 శాతం కంటే తక్కువే ఉంది.  అన్ని జిల్లాల్లో రికవరీ రేటు పెరుగుతోంది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతోంది. దీంతో ఇప్పటికే 9 జిల్లాల్లో కర్ఫ్యూలో భారీగా మినాహాయింపు ఇచ్చింది. రాత్రి 9 గంటల వరకు షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది.  ఎత్తేసింది ఏపీ ప్రభుత్వం.. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే సాధరణ పరిస్థితి రావొచ్చని ప్రజలకు పిలుపు ఇస్తోంది. మరోవైపు కరోనా కారణంగా చాలా రోజుల నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. అలా మూత పడిన ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రొటోకాల్‌ పాటిస్తూ పాఠశాలలకు టీచర్లు మాత్రమే హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్‌ పరిస్థితులు సద్దుమణిగాక మాత్రమే విద్యార్థులను స్కూళ్లకు అనుమతిస్తారు. అయితే ఆ లోపు విద్యార్థులకు ఎలా బోధన అందించాలి.. ఎలాంటి విధానంతో ముందుకు వెళ్లాలి అన్నదానిపై ఆయ పాఠశాలలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

    ప్రస్తుతం టీచర్లు రోజువిడిచిరోజు అంటే ఒకరోజు కొందరు, మరోరోజు కొందరు వచ్చేలా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎవరు ఎప్పుడు పాఠశాలకు హాజరుకావాలన్న ప్రణాళికను ప్రధానోపాధ్యాయులు రూపొందించి అమలు చేస్తారు. 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి బోధనాభ్యసన సన్నద్ధతకు వీలుగా ఏర్పాట్లు చేపట్టనున్నారు. ముందుగా టీచర్లను సన్నద్ధం చేస్తూ అదే సమయంలో కోవిడ్‌ కారణంగా ఇళ్లవద్దనే ఉంటున్న పిల్లలకు చదువులకోసం తగిన సహాయ సహకారాలు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

    ఇవాళే పాఠశాలల తిరిగి ప్రారంభం అవుతుండడంతో ఈ రోజు మాత్రం అన్ని పాఠశాలల టీచర్లంతా స్కూళ్లకు హాజరుకావాలి. మరుసటి రోజు నుంచి రోజూ సగం మంది వంతున రావాలి. హైస్కూళ్లలో రోజూ తప్పనిసరిగా సగం మంది టీచర్లు ఉండేలా ప్రధానోపాధ్యాయుడు చూసుకోవాలి. విద్యార్థులకు డిజిటల్‌ పరికరాల అందుబాటు, వారితో అభ్యసన ప్రక్రియ సాగించే విధానాలపై ఎక్కడికక్కడ ప్రణాళికలు రూపొందించుకోవాలి. తమ తరగతి పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటే వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటుచేయించి వాటిద్వారా బోధనాభ్యసన ప్రక్రియలు సాగించాలి. జూలై 2 నుంచి 15వ తేదీ వరకు పునశ్చరణ చేయించాలి. జూలై 15 నుంచి ఎస్సీఈఆర్టీ పిల్లలకు వర్క్‌షీట్లు పంపిణీ చేయాలి. తల్లిదండ్రులు మాత్రమే పాఠశాలలకు వెళ్లి వర్క్‌షీట్లు తీసుకోవాలి. రేడియో, దూరదర్శన్‌ ద్వారా విద్యాబోధనకు షెడ్యూల్‌ను ఎస్సీఈఆర్టీ విడుదల చేయనుంది. జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, మనబడి నాడు–నేడు వంటి కార్యక్రమాలు సమర్థంగా జరిగేలా టీచర్లు చూడాలి. జగనన్న విద్యాకానుక కిట్‌లను విద్యార్థులు స్కూళ్లకు వచ్చేనాటికి పంపిణీకి వీలుగా సిద్ధం చేసుకోవాలి ఉన్నతాధికారులు సూచించారు.
    Published by:Nagesh Paina
    First published: