హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Schools: పిల్లలకు బెస్ట్‌ స్కూల్‌ను ఎలా సెలక్ట్‌ చేయాలి..? విద్యా నిపుణుల సూచనలు ఇవే..

Schools: పిల్లలకు బెస్ట్‌ స్కూల్‌ను ఎలా సెలక్ట్‌ చేయాలి..? విద్యా నిపుణుల సూచనలు ఇవే..

Schools: పిల్లలకు బెస్ట్‌ స్కూల్‌ను ఎలా సెలక్ట్‌ చేయాలి? విద్యా నిపుణుల సూచనలు ఇవే..

Schools: పిల్లలకు బెస్ట్‌ స్కూల్‌ను ఎలా సెలక్ట్‌ చేయాలి? విద్యా నిపుణుల సూచనలు ఇవే..

తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించే సమయంలో ఎన్నో విషయాల్ని పేరెంట్స్‌ పరిగణలోకి తీసుకుంటారు. ఆ పాఠశాల స్టాండర్డ్స్‌ ఏంటి? ఏ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ని ఫాలో అవుతున్నారు? టీచర్లు ఎలా బోధిస్తున్నారు? వంటి విషయాలన్నీ పరిశీలిస్తారు. అయితే ప్రముఖ విద్యావేత్త (Educationist) ఫ్రాన్సిస్ జోసెఫ్‌ ఈ విషయమై తన అభిప్రాయాల్ని వెల్లడించారు.  

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, వారు మంచి వ్యక్తిత్వం గల వారిగా ఎదగాలన్నా మంచి స్కూల్‌ (School)లో చదివించాలనేది ప్రతి తల్లిదండ్రుల ఆలోచన. అందుకే తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించే సమయంలో ఎన్నో విషయాల్ని పేరెంట్స్‌ పరిగణలోకి తీసుకుంటారు. ఆ పాఠశాల స్టాండర్డ్స్‌ ఏంటి? ఏ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ని ఫాలో అవుతున్నారు? టీచర్లు ఎలా బోధిస్తున్నారు? వంటి విషయాలన్నీ పరిశీలిస్తారు. అయితే ప్రముఖ విద్యావేత్త (Educationist) ఫ్రాన్సిస్ జోసెఫ్‌ ఈ విషయమై తన అభిప్రాయాల్ని వెల్లడించారు. గొప్ప గొప్ప స్కూల్స్‌ వేటిని బేస్‌గా చేసుకుని స్కూళ్లను నడుపుతాయో తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఆ వివరాల ఆధారంగా బెస్ట్‌ స్కూల్స్‌కి ఉండాల్సిన లక్షణాలేవో చూద్దాం.

టీచింగ్‌, లెర్నింగ్‌ టెక్నిక్‌లు పరిశీలించాలి

పాఠశాలలు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్(SDG) పెట్టుకోవాలి. విద్యార్థులకు అవసరమైన టెక్నాలజీలు(Technologies), రిసోర్స్‌లను అందుబాటులో ఉంచాలి. చక్కని బోధనా వాతావరణం తప్పనిసరిగా కల్పించాలి. మంచి టీచింగ్‌, లెర్నింగ్‌ టెక్నిక్‌లను పాటించడంలో స్కూళ్లు ఎలాంటి కల్చర్‌ని పాటిస్తున్నాయో గమనించాలి. అవి సాధించిన అచీవ్‌మెంట్లనూ పరిగణలోకి తీసుకోవాలి. విద్యార్థి ఓవరాల్‌ డెవలప్‌మెంట్‌ కోసం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాయో గమనించాలి. అసైన్‌మెంట్‌ స్ట్రాటజీలు కూడా అవసరం. అవి ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటే విద్యార్థులలో అంత బాగా మార్పులు వస్తాయి. ఇవి పాఠశాల సక్సెస్‌ పైనా మంచి ప్రభావం చూపుతాయి.

Oppo Smart Phone Price Cut: బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఒప్పొ ఏ17కె ధర తగ్గింపు. ఈ ఫోన్‌ లేటెస్ట్‌ ప్రైస్‌ ఎంతంటే..

తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి

విద్యార్థుల దగ్గరకు వెళ్లడం, వారు సొంతంగా ఎలా చదువుకుంటున్నారు? అనే విషయాలను గుర్తించడం చేయాలి. ఈ విషయాలలో వారు ఎంత సెల్ఫ్‌ ఎఫిషియంట్‌గా ఉన్నారో గమనించాలి. ఎప్పుడు ఏమి అవసరం వచ్చినా వారికి జవాబుదారిగా నిలబడగలగాలి. వారి విజయాలలో భాగస్వాములుగా కావడానికి సిద్ధంగా ఉండాలి. దీంతో వారు విద్యార్థి దశలోనే కాదు పెద్ద వారయ్యాక కూడా ఆ విజయాల్ని కొనసాగిస్తారు.

సెల్ఫ్‌ మోటివేషన్‌తో పని చేసే టీచర్లు ఉండాలి. పిల్లలకు అవసరమైనట్లుగా తగిన బోధనా విధానాలను అవలంబించే వారై ఉండాలి. రెగ్యులర్‌గా తల్లిదండ్రుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని అవసరమైన మార్పులు చేస్తుండాలి. పిల్లలు, ఉద్యోగుల ఆరోగ్య భద్రత, క్షేమం పాఠశాల టాప్‌ ప్రయారిటీలలో ఒకటిగా ఉండాలి. సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ ఉన్నప్పుడే ఆ పాఠశాల ఉత్తమ విద్యను అందించ గలుగుతుంది. కాబట్టి పాఠశాలకు ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్‌ చేసుకున్న తర్వాత మాత్రమే పిల్లలను అందులో చేర్చడం మంచిది. అప్పుడే పిల్లలు అన్ని విధాలుగా అభివృద్ధి కాగల వాతావరణం కల్పించగలరు.

First published:

Tags: Career and Courses, JOBS, School

ఉత్తమ కథలు