Home /News /jobs /

SCHOOL HIRING TEACHERS ONLY FOR JEE NEET COACHING RAISES QUESTION ON EDUCATION SYSTEM UMG GH

School Teachers: కేవలం ఆ పాఠాలు చెప్పడానికే టీచర్లు కావాలంట.. ట్విటర్‌లో హాట్ టాపిక్‌గా వ్యవహారం..!

జేఈఈ, నీట్ క్లాసెస్ చెప్పేందుకు టీచర్స్ అంటూ ప్రకటన

జేఈఈ, నీట్ క్లాసెస్ చెప్పేందుకు టీచర్స్ అంటూ ప్రకటన

నీట్, జేఈఈ కోచింగ్ ఇవ్వడానికి టీచర్లు కావాలని ఒక విద్యాసంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు ట్విట్టర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విద్యాలయాల్లో చదువు కేవలం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లకేనా? సాధారణ విద్యాబోధన సంగతేంటి? అనే సందేహాలను లేవనెత్తిందీ ప్రకటన.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
నీట్, జేఈఈ కోచింగ్ ఇవ్వడానికి టీచర్లు కావాలని ఒక విద్యాసంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు ట్విట్టర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విద్యాలయాల్లో చదువు కేవలం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లకేనా? సాధారణ విద్యాబోధన సంగతేంటి? అనే సందేహాలను లేవనెత్తిందీ ప్రకటన. ఆ ప్రకటన వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన శ్రీ విలే పార్లే కేల్వానీ మండల్ అనే పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఒక స్కూలు IIT-JEE/NEET ఫౌండేషన్ కోచింగ్ కోసం బోధన సిబ్బంది కావాలని ఒక ప్రకటన జారీ చేసింది. దానిలో ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్ టీచర్ల భర్తీకి ప్రకటన ఇస్తూ, రెండేళ్ల బోధన అనుభవం ఉన్న బీటెక్, బీఈ, బీఈడీ వారు అర్హులని పేర్కొంది.

విద్యావేత్త ఫ్రాన్సిస్ జోసెఫ్ ట్విటర్‌లో దీన్ని పోస్ట్ చేస్తూ, IIT-JEE & NEET వంటి పోటీ పరీక్షల కోసమే నేడు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు బోధన సిబ్బందిని నియమించుకుంటున్నాయని, చూస్తుంటే చదువు అనేది ‘అభ్యాసం’ నుంచి ‘పోటీ పరీక్షలకు కుస్తీ పట్టడం’లా మారిపోతుందన్నారు. ఆలస్యం కాకముందే ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందనీ, విద్యాలయాల పట్ల నాకున్న గౌరవం కొద్దీ ఈ మాట చెబుతున్నానని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: రోజు రోజుకీ కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సప్.. ఇక డిలీట్ ఆప్షన్ ఎన్ని రోజుల తర్వాత చేయొచ్చంటే!


జోసెఫ్ పోస్ట్‌తో చాలామంది ఏకీభవించారు. కొంతమంది నెటిజన్లు ఈ ట్విట్టర్ పోస్టుపై వ్యాఖ్యానిస్తూ, దేశంలో కోచింగ్ మాఫియా JEE అడ్వాన్స్‌డ్, NEET వంటి ప్రవేశ పరీక్షలే చాలా ముఖ్యమైనవనే భావనలోకి విద్యార్థులను నెట్టివేస్తుందని, తద్వారా నిజమైన చదువుకు అర్థం లేకుండా చేసి, ఆ పోటీపరీక్షలకు పోటీ పడలేని వారి కెరీర్‌ని ముగిసిపోయేలా చేస్తుందని దుయ్యబట్టారు.

మరికొంతమంది దానికి భిన్నమైన వాదన వినిపిస్తూ, నిజానికి ఇది మంచి పరిణామమన్నారు. ప్రతిభ కలిగిన అధ్యాపకులు మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ టాపిక్స్‌ను పిల్లలకు పరిచయం చేస్తున్నారని, సాధారణ వార్షిక పరీక్షలకు సిద్ధమవ్వడం కంటే ఇలా పోటీ పరీక్షలకు ప్రిపేరవ్వడం మేలని అంటున్నారు. ‘మంచి అకడమిక్ రికార్డు కలిగి, తమ సామర్థ్యంపై నమ్మకమున్న ప్రతిభావంతులైన టీచర్లు విద్యార్థులకు లభిస్తున్నారు. వారి సామర్థ్యానికి తగిన వేతనం కూడా టీచర్లకు లభిస్తుంది. ఇది నిజంగా మంచిది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.అయితే విద్యాసంస్థల్లో పోటీ పరీక్షల కోచింగ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. దీనిలో ఉన్న ఆర్థిక కోణం గమనిస్తే, తల్లిదండ్రులు తమ పిల్లల కోచింగ్ కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇది మామూలు స్కూలు ఫీజులకు అదనం. మరి అంత డబ్బు కట్టలేక నాణ్యమైన విద్యను పొందలేకపోతున్న విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలువలేక నష్టపోతున్నారు. దీనికో పరిష్కారం చూపించాలి. అదే సమయంలో ఐఐటీ లేదా నీట్ వంటి పోటీ పరీక్షలు కాకుండా కూడా భవిష్యత్తు ఉందని పిల్లలకు తెలియజెప్పాలి.
Published by:Mahesh
First published:

Tags: Jee, JOBS, NEET, Teacher jobs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు