SCHOLARSHIPS SPECIAL SCHOLARSHIP FOR INDIAN STUDENTS NEWLY ANNOUNCED UK UNIVERSITY GH VB
Scholarships: ఇండియన్ స్టూడెంట్స్ కోసం స్పెషల్ స్కాలర్షిప్.. ప్రకటించిన యూకే యూనివర్సిటీ.. వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
ఇండియన్ స్టూడెంట్స్‌కు ప్రోత్సాహకాలు ప్రకటించింది బ్రిటన్‌లోని యూనివర్సిటీ లివింగ్ విద్యాసంస్థ. యూకేలోని నాటింగ్‌హామ్ ట్రెండ్ యూనివర్సిటీ సహకారంతో యూనివర్సిటీ లివింగ్ సోషల్ స్కాలర్షిప్స్ ప్రకటించింది.
ఇండియన్ స్టూడెంట్స్‌కు (Indian Students)ప్రోత్సాహకాలు ప్రకటించింది బ్రిటన్‌లోని (Britan) యూనివర్సిటీ(University) లివింగ్ విద్యాసంస్థ. యూకేలోని నాటింగ్‌హామ్ ట్రెండ్(Trend) యూనివర్సిటీ సహకారంతో యూనివర్సిటీ లివింగ్ సోషల్ స్కాలర్షిప్స్(Social Scholarships) ప్రకటించింది. ఈ మేరకు భారత పౌరసత్వం ఉన్న విద్యార్థుల కోసం సోషల్ స్కాలర్ షిప్‌లను అందించనుంది. విద్యార్థులు(Students) సమాజం కోసం లేదా పర్యావరణం, ప్రజలకు ఏదో ఒక విధంగా సహాయం అందిస్తూ ఉండాలని, అలాంటి వారి కోసం ఈ స్కాలర్ షిప్‌లను ప్రవేశ పెడుతున్నామని విద్యాసంస్థ పేర్కొంది. ఇవి విద్యార్థుల అకడమిక్(Academic) పనితీరుపై ఆధారపడి ఉండవు. అభ్యర్థి గత కొన్నేళ్లుగా సమాజంపై తన ప్రాజెక్ట్(Project) ద్వారా చూపిన సామాజిక ప్రభావం ఆధారంగా స్కాలర్ షిప్‌లను మంజూరు చేయనున్నారు.
స్టెప్3: దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చిన ఫారమ్‌లో అవసరమైన వివరాలను పూరించడానికి స్క్రోల్ చేయండి.
స్టెప్4: మీ సామాజిక సేవలకు సంబంధించిన ఓ వీడియోను రికార్డు చేయండి
స్టెప్5: ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌గా అప్లోడ్ చేసి, నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్సిటీ, యూనివర్శిటీ లివింగ్‌కు ట్యాగ్ చేయండి.
భారతీయ పౌరసత్వం ఉండి UKలోని నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు మాత్రమే సోషల్ స్కాలర్షిప్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం సెప్టెంబర్ 2022లోపు దరఖాస్తు చేసుకోవాలి. NTUలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులందరు ఈ స్కాలర్ షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే NTUలో అర్హత కలిగిన పుల్ టైం కోర్సులో చేరడానికి అభ్యర్థి అడ్మిషన్ పొంది ఉండాలి.
మరోవైపు, బ్రిటీష్ కౌన్సిల్ 2022-23 విద్యా సంవత్సరానికి వివిధ అధ్యయన రంగాల్లో భారతీయుల కోసం కొత్త పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) స్కాలర్షిప్లను ప్రకటించింది. యూకేలోని 16 యూనివర్సిటీల్లో వ్యాపారం, ఆర్థికం, మానవీయ శాస్త్రాలు, మనస్తత్వ శాస్త్ర వ్యవస్థాపకత, మార్కెటింగ్, HR, సంగీతం వంటి రంగాల్లో అధ్యయనం కోసం భారతీయ విద్యార్థులకు 20 స్కాలర్షిప్లను మంజూరు చేయనున్నారు. అంతేకాకుండా మానవ హక్కులు, క్రిమినల్ జస్టిస్, వాణిజ్య చట్టం వంటి న్యాయ సబ్జెక్టులకు సంబంధించిన కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు మరో 7 స్కాలర్షిప్లు కేటాయించారు.
ప్రతి స్కాలర్షిప్ కనీసం 10,000 ఫౌండ్ల విలువైనది. ఒక సంవత్సరం పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుకు సంబంధించిన ట్యూషన్ ఫీజు కోసం ఈ స్కాలర్ షిప్‌లను ప్రవేశపెట్టారు. స్కాలర్షిప్ అర్హత ప్రమాణాలు, UK యూనివర్సిటీల పూర్తి జాబితా, అందుబాటులో ఉన్న కోర్సులు వంటి సమాచారం కోసం అభ్యర్థులు britishcouncil.in/study-uk/scholarships/great-scholarships వెబ్ సైట్‌ను సందర్శించాలి. యూకేలోని ఏదైనా రెండు యూనివర్సిటీల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనం కోసం భారతీయ ఇంగ్లీష్ టీచర్ల కోసం పూర్తి నిధులతో కూడిన ఆరు స్కాలర్ షిప్‌లను కూడా ప్రకటించింది బ్రిటిష్ కౌన్సిల్.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.