Scholarship : ఇంటర్‌ తర్వాత స్కాలర్‌షిప్.. ఇలా అప్లై చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

చదువుకునే విద్యార్థులకి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం సరికొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా ఇంటర్ పూర్తైన విద్యార్థులకి స్కాలర్ షిప్ అందించనుంది.. ఆ వివరాలు మీకోసం..

  • Share this:
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు తెచ్చుకుని, డిగ్రీ/వృత్తి విద్యా కోర్సుల్లో చేరినవారు కేంద్రప్రభుత్వ స్కాలర్‌షిప్ పొందొచ్చు. డిగ్రీ, వృత్తి విద్యాకోర్సులు చదువుతున్న విద్యార్థులకి ‘సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్స్’ కింద భారతప్రభుత్వం ఉపకారవేతనాలు అందజేస్తుంది. మొత్తం 82వేలమందికి ఈ స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు. డిగ్రీ, పీజీ వరకూ మొత్తం అయిదేళ్లపాటు ఈ స్కాలర్‌షిప్ సౌలభ్యం ఉంటుంది. బీటెక్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులవారికి నాలుగేళ్ల వరకు చెల్లిస్తారు. ఇందులో సాధారణ డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్ పీజీలు చదువుతున్నవారికి ఏడాదికి రూ.10,000 చొప్పున మూడేల్లు.. పీజీలో చేరిన తర్వాత రూ.ఏడాదికి రూ.20,000 చెల్లిస్తారు.
ఈ స్కాలర్ షిప్ పొందాలంటే..
* ఇంటర్ లేదా ప్లస్ 2 లో 80 పర్సెంటేజ్ కంటే ఎక్కువ మార్కులు సాధించాలి.
* రెగ్యులర్ విధానంలో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు
* డిప్లొమా విద్యార్థులకి అవకాశం లేదు.
* తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8లక్షల లోపు ఉండాలి
* స్కాలర్‌షిప్ పొందాలనుకున్నవారు. ఇతర వేరే స్కాలర్ షిప్పులనూ పొందని వారై ఉండాలి
* ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించినవారు ఈ స్కాలర్‌షిప్‌కి అనర్హులు.
* ఇంటర్ తర్వాత ప్రతీ ఏడాది స్కాలర్‌షిప్ పొందాలనుకుంటే నిర్దేశిత మార్కులు, కనీస హాజరు ఉండాలి
* దరఖాస్తు చేయాలనుకునేవారు https://scholarships.gov.in/లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ * హయ్యర్ ఎడ్యుకేషన్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరితేదీ : అక్టోబర్ 31

ఇవి కూడా చదవండి..

Career Guidance : ఎనిమిది పాసైతే చాలు.. కోర్సు నేర్పించి జాబ్ కల్పించే సంస్థ.. పూర్తి వివరాలు ఇవే..
First published: