SCHOLARSHIPS DATA SCIENCE SPECIAL SCHOLARSHIPS FOR STUDENTS SELECTION PROCESS BASED ON MERIT DETAILS HERE GH VB
Scholarships: డేటా సైన్స్ విద్యార్థుల కోసం స్పెషల్ స్కాలర్ షిప్స్.. ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..
ప్రతీకాత్మక చిత్రం
డేటా సైన్స్‌ను కెరీర్‌గా ఎంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ప్రముఖ ఎడ్టెక్ స్టార్టప్ కంపెనీ ‘స్కిల్ఎనేబుల్’ (SkillEnable) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ.1 లక్ష వరకు స్కాలర్షిప్లను అందజేయనున్నట్లు ప్రకటించింది
డేటా సైన్స్‌ను కెరీర్‌గా(Career) ఎంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ప్రముఖ ఎడ్టెక్ స్టార్టప్ కంపెనీ ‘స్కిల్ఎనేబుల్’ (SkillEnable) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ.1 లక్ష వరకు స్కాలర్షిప్లను అందజేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 500 మంది విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ల ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఒక్కొ విద్యార్థికి కనీస స్కాలర్షిప్(Scholarship) రూ. 50,000 నుంచి గరిష్టంగా రూ. 1 లక్ష ఉంటుంది. స్కాలర్‌షిప్‌ల కోసం దాదాపు రూ. 5 కోట్లు నిధులను కేటాయించినట్లు ఎడ్టెక్ స్టార్టప్(EdTech Startup) కంపెనీ స్కిల్ఎనేబుల్ తెలిపింది.
డేటా సైన్స్‌లో విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించేందుకు మెరిట్ ఆధారిత ఎంపిక ప్రక్రియను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ప్రవేశ ప్రక్రియ ముగిసిన వెంటనే స్కాలర్షిప్ అర్హత పరీక్ష కోసం విద్యార్థులు ప్రయత్నించవచ్చు. ఈ స్కాలర్షిప్లు డేటా సైన్స్‌తోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సులను కూడా కవర్ చేస్తాయి. ఓ స్టార్టప్ కంపెనీ స్కాలర్షిప్లను ఆఫర్ చేయడం ఇదే తొలిసారి. డేటా సైంటిస్టులను కనుగొనడం, ఎంపిక చేసుకుని ప్రోత్సహించడం కోసం SkillEnable కంపెనీ కృషి చేస్తోంది. పరిశ్రమ అవసరాలను తీర్చడానికి విద్యార్థులకు టైలర్-మేడ్ కోర్సులను అందిస్తుంది. అలాగే ఉద్యోగ సంబంధిత నైపుణ్యాల కోసం సెట్ శిక్షణ, నెట్వర్కింగ్, ఇంటర్వ్యూ ప్రాక్టీస్ వంటి తదితర సాఫ్ట్ స్కిల్స్‌పై వారికి శిక్షణ ఇస్తుంది.
ఈ కోర్సు ఆదాయ- షేరింగ్ పథకం ఫార్మాట్లో నడుస్తుంది. దీని ప్రకారం విద్యార్థులు కనీస హామీ జీతం లేదా అంతకంటే ఎక్కువ సంపాదించడం ప్రారంభించినప్పుడు కోర్సు రుసుమును SkillEnable కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు సంపాదించిన జీతంలో ముందుగా నిర్ణయించిన కొంత మొత్తాన్ని చెల్లించడం ద్వారా గరిష్టంగా నిర్ణీత కాలంలో చెల్లించాలని స్టార్టప్ SkillEnable తెలిపింది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ చూడాలని కోరింది.
Telangana Jobs: తెలంగాణ కొలువుల జాతర.. మరో 1271 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే
మరోవైపు, ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISc) బెంగళూరు... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), క్లౌడ్‌తో కూడిన 5జీ టెక్నాలజీస్‌పై పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. హైపర్-కనెక్ట్టెడ్ కమ్యూనికేషన్ స్పేస్‌లో అభివృద్ధి చెందుతున్న 5G టెక్నాలజీలో టెక్ నిపుణులు మరింత మెరుగ్గా రాణించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. గ్లోబల్ ఎడ్టెక్ కంపెనీ టాలెంట్‌స్ప్రింట్ భాగస్వామ్యంతో ఈ కోర్సును ఐఐఎస్ బెంగళూరు చేపట్టనుంది. '5G-రెడీ ప్రొఫెషనల్స్‌తో కూడిన నిపుణుల సమూహాన్ని సృష్టించడమే తమ లక్ష్యమని ఐఐఎస్ బెంగళూరు తెలిపింది.
ఇంజనీరింగ్ లేదా సంబంధిత డిగ్రీలతో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఈ కోర్సును డిజైన్ చేశారు. కోర్సు ఫార్మాట్ రెండు భాగాలుగా విభజించారు. ఒకటి 5G టెక్నాలజీస్‌లో అడ్వాన్స్డ్ సర్టిఫికేట్‌తో తొమ్మిది నెలల ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ఉంటుంది. మరొకటి 5G టెక్నాలజీలో అడ్వాన్స్డ్ సర్టిఫికేట్‌తో కూడిన ఆరు నెలల ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ఆపై IISc బెంగళూరు క్యాంపస్ సందర్శన, IISc ఫ్యాకల్టీ, పరిశ్రమ నిపుణులతో ప్రత్యక్ష ఇంటరాక్టివ్ సెషన్లు ఉండనున్నాయి. Talent Sprint డిజిటల్ ప్లాట్ఫారం iearl.ai ద్వారా ఈ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు ప్రోగ్రామ్ పేజీ iisc.talentsprint.com/5g/ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.