హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Scholarships: ఉన్నత విద్య కోసం అందుబాటులో స్కాలర్‌షిప్స్.. ఈ నెలలో అప్లై చేసుకోవాల్సినవి ఇవే..

Scholarships: ఉన్నత విద్య కోసం అందుబాటులో స్కాలర్‌షిప్స్.. ఈ నెలలో అప్లై చేసుకోవాల్సినవి ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2022 మే నెలలో దరఖాస్తు చేసుకోవడానికి దేశంలో ప్రధానంగా ఉన్న మూడు స్కాలర్‌షిప్, ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుత కాలంలో ఉన్నత విద్యకు ఖర్చు ఎక్కువ అవుతోంది. దీంతోపాటు కుటుంబ వార్షిక ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది విద్యార్థులు(Students) మెరిట్(Merit) ఉన్నా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి వారి కోసమే కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు స్కాలర్ షిప్‌లను(Scholarships) అందిస్తూ విద్యార్థులకు చేయూతనిస్తున్నాయి. విద్యార్థుల అర్హతలు, వయసు ఆధారంగా అందించే ఆర్థిక సహాయమే స్కాలర్ షిప్‌లు. దేశంలో కరోనా(Corona) మహమ్మారి విజృంభించినప్పుడు చాలా సంస్థలు విద్యార్థులకు ఆసరాగా నిలిచేందుకు స్కాలర్ షిప్‌లను ప్రకటించాయి. కరోనా కారణంగా తల్లిదండ్రులను లేదా సంరక్షకులను కోల్పోయిన విద్యార్థులకు మద్దతుగా ఇవి నిలిచాయి.

సరైన స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లు కెరీర్ తిరిగి ప్రారంభించడానికి బూస్టప్‌లా పనిచేస్తాయి. విదేశాల్లోని కొన్ని స్టడీ స్కాలర్‌షిప్‌లు కూడా చాలా తక్కువ ఫీజుతో విదేశీ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి సహాయపడతాయి. 2022 మే నెలలో దరఖాస్తు చేసుకోవడానికి దేశంలో ప్రధానంగా ఉన్న మూడు స్కాలర్‌షిప్, ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

1. గూగుల్ PHD ఫెలోషిప్ ఇండియా ప్రోగ్రామ్ 2022

Ph.D స్కాలర్స్‌ కోసం Google ఈ ఫెలోషిప్ ప్రకటించింది. ఫ్యూచర్ టెక్నాలజీని ప్రభావితం చేయడానికి ప్రయత్నించే అభ్యర్థుల కోసం ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టారు.

Bank Fixed Deposits: రెపో రేట్ ప్రభావం.. వడ్డీ రేట్లు పెంచిన ప్రముఖ బ్యాంకులు.. కొత్త రేట్లు పరిశీలించండి..


అర్హతలు

ఇండియన్ యూనివర్సిటీల నుండి అండర్ గ్రాడ్యుయేట్/మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం PhD ప్రోగ్రామ్‌ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌ పొందేందుకు అర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా భారతదేశంలో నమోదైన సంస్థలో ఉద్యోగం చేస్తున్న నిపుణులై ఉండాలి. గరిష్టంగా USD 50Kతో పాటు ఇతర ప్రయోజనాలను బహుమతులు, రివార్డ్‌ల రూపంలో పొందనున్నారు. గూగూల్ ఫెలోషిప్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 18. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం https://research.google/outreach/phd-fellowship/ సందర్శించండి.

2. లేడీ మెహెర్‌బాయి డి టాటా ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ 2022

టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా లేడీ మెహెర్‌బాయి డి టాటా ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్‌లు మంజూరు కానున్నాయి. నిర్దేశిత రంగాలలో విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ మహిళా గ్రాడ్యుయేట్‌ల కోసం ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.

అర్హతలు

టాప్ యూనివర్సిటీల్లో చదివి మెరిట్ సాధించిన భారత మహిళా గ్రాడ్యుయేట్లు ఈ స్కాలర్‌షిప్‌లకు అర్హులు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా కనీసం 2 సంవత్సరాల సంబంధిత వర్క్ ఎక్స్ పీరియన్స్‌తో 2022- 2023 సంవత్సరానికి యునైటెడ్ స్టేట్స్, UK లేదా యూరప్‌లోని టాప్ యూనివర్సిటీలు లేదా సంస్థల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి లేదా అప్పటికే సేప్ అడ్మిషన్ కలిగి ఉండాలి. అప్లికేషన్‌ను ఇమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు https://www.tatatrusts.org/home/index యూఆర్ఎల్‌పై క్లిక్ చేయండి.

3. ఇండియన్ కల్చర్ ICCR స్కాలర్‌షిప్ 2022-23

ఈ ఫెలోషిప్‌ను భారత ప్రభుత్వం అందిస్తుంది. 18-30 సంవత్సరాల మధ్య వయస్సు విద్యార్థుల కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ స్కాలర్ షిప్‌లను మంజూరు చేయనుంది.

అర్హత

నృత్యం, సంగీతం, థియేటర్, ప్రదర్శన కళ, శిల్పం, భారతీయ భాషలు, భారతీయ వంటకాలు తదితర భారతీయ సంస్కృతిని అభ్యసిస్తున్న అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్‌‌లైన్ ద్వారా మాత్రమే పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు https://eoiaddisababa.gov.in/iccr-scholarship-for-indian-culture-ay-2022-23/ లింక్‌పై క్లిక్ చేయండి.

First published:

Tags: Career and Courses, Higher education, Scholarship, Scholarships

ఉత్తమ కథలు