Home /News /jobs /

SCHOLARSHIPS ARE YOU TRYING FOR A SCHOLARSHIP IN HIGHER EDUCATION THEN FIND OUT ABOUT THESE EVK

Scholarships: ఉన్న‌త విద్య‌లో స్కాల‌ర్‌షిప్ కోసం ట్రై చేస్తున్నారా.. అయితే వీటి గురించి తెలుసుకోండి

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఉన్నత విద్య చ‌దువుకోవ‌డం చాలా మందికి ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుంది. వారి కోస‌మే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్- ఫెలోషిప్‌లను అందిస్తోంది. వాటి వివ‌రాలు తెలుసుకోండి.

    ఉన్నత విద్య కలను సాకారం చేసుకోవడంలో స్కాలర్‌షిప్‌ , ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లు (Fellow Ship Programme) ఆర్థికంగా మద్దతుగా నిలుస్తాయి. విద్యార్హత, వయస్సు బట్టి అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉండవచ్చు. కరోనా(Corona) మహమ్మారి దేశంలో విజృంభించిన సమయంలో అనేక సంస్థలు విద్యార్థులను ఆదుకోవడం కోసం స్కాలర్‌షిప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్‌లు(Scholarships) ఆర్థికంగా చేయుతనిస్తాయి. సరైన స్కాలర్‌షిప్, ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా నైపుణ్యాలను మెరుగుపర్చుకుని ఉద్యోగ కెరీర్‌ను(Job Career) ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్- ఫెలోషిప్‌ల జాబితాను పరిశీలిద్దాం.

    IIT Hyderabad Recruitment: ఐఐటీ హైద‌రాబాద్‌లో రీసెర్చ్ ఫెలో జాబ్స్‌.. వేత‌నం నెల‌కు రూ.42,000.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు

    AICTE బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్) ఇంటర్న్‌షిప్ -2022
    ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులు 12 నెలల పాటు మెర్రీ గో లెర్న్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది.

    అర్హతలు
    బిజినెస్ డెవలప్‌మెంట్‌ను కెరీర్‌గా ఎంచుకునే అభ్యర్థులు ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు తప్పనిసరిగా ఇంగ్లీష్‌పై మంచి పట్టు ఉండాలి. అలాగే అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్య పరిష్కారం, ప్రజెంటేషన్, సంస్థాగత నైపుణ్యాలను కలిగి ఉండాలి. ప్రతిభను బట్టి అభ్యర్థులకు నెలకు రూ. 8,000 రివార్డ్ రూపంలో ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

    మరిన్ని వివరాలకు https://internship.aicte-india.org/internship-details.php?uid=INTERNSHIP_1650457299625ffad38fa1e లింక్‌పై క్లిక్ చేయండి.

    * AICTE తులిప్ ఫైనాన్స్ ఇంటర్న్‌షిప్ -2022
    తులిప్ ఫైనాన్స్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ప్రత్యేక చొరవ తీసుకుంది. కంపెనీ ఫైనాన్స్, వివిధ స్కీమ్ నిధుల వినియోగం, ఆర్థిక నివేదికలను తయారు చేయడం, అంతర్గత ఆడిట్‌లలో సహకారం అందిచడం వంటి రోజువారీ కార్యకలాపాలపై అవగాహన కల్పించడం, వాటిని సులభతరం చేయడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.

    Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన గ‌వ‌ర్న‌మెంట్‌ జాబ్స్‌.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం

    అర్హతలు
    BA డిగ్రీ పూర్తి చేసి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఇంటర్న్‌షిప్‌‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు రివార్డుల రూపంలో నెలకు రూ. 10వేలు అందనుంది. ఈ ప్రోగ్రామ్ కోసంఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 31. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ https://internship.aicte-india.org/internship-details.php?uid=INTERNSHIPGOV_1650431692625f96cc4bdfa&level=2 పై క్లిక్ చేయండి.

    * నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్)- 2022
    12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, ప్రస్తుతం చదువుతున్న వారు కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరుకావచ్చు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NISER), భువనేశ్వర్, ముంబై యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (UM-DAE CEBS) ఈ స్క్రీనింగ్ టెస్ట్ కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నాయి. ప్రతిభ ఉన్న విద్యార్థులు ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌‌లలో చదివేలా చేయడమే ఈ పరీక్ష లక్ష్యం.

    Job News: ఉపాధి అవకాశాలే ముఖ్యం.. ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం

    అర్హతలు
    12వ తరగతి బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2020 లేదా 2021 సంవత్సరంలో సైన్స్ స్ట్రీమ్‌లో బోర్డుకు సమానమైన పరీక్ష ఉత్తీర్ణత సాధించినవారు ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హులు. అభ్యర్థులకు బోర్డు పరీక్షల్లో కనీసం 60 శాతం మార్కులు కచ్చితంగా వచ్చి ఉండాలి. నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్‌కు ఆన్‌లైన్‌లో మే18లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు https://www.nestexam.in/ లింక్‌పై క్లిక్ చేయండి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Scholarship, Scholarships

    తదుపరి వార్తలు