చదువుకునే వారికి ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా స్కాలర్‌షిప్(Scholarship), ఫెలోషిప్ ప్రోగ్రాంలు ఎప్పటికప్పుడు అమలు అవుతూనే ఉన్నాయి. అందులో భాగంగా మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన పిల్లల చదువుల కోసం కొన్ని సంస్థలు స్పెషల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాంలను(Programmes) ప్రకటించాయి. ఈ స్కాలర్‌షిప్ స్కీమ్స్, విద్యార్థులకు ఆర్థికంగా చేయూత ఇవ్వడంతో పాటు మంచి అకడమిక్ అడ్వయిజర్స్, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌తో యాక్సెస్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ నవంబర్ నుంచి డిసెంబర్(December) వరకు.. మహిళలు, నిరుపేద పిల్లల కోసం అందుబాటులో ఉన్న, అప్లై చేసుకోవాల్సిన స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
U-GO స్కాలర్‌షిప్ ప్రోగ్రాం
గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న మహిళల కోసం ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న మెరిట్ విద్యార్థినులు దీనికి అర్హులు. భారతదేశంలో టీచింగ్, నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజినీరింగ్ లాంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుదారులు 10, 12 తరగతుల్లో కనీసం 70% మార్కులు సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా రూ. 5లక్షల కంటే తక్కువగా ఉండాలి. www.b4s.in/it/UGO1 సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇందుకు చివరి తేదీ నవంబర్ 30. ఎంపికైన విద్యార్థినులకు వారి అవసరాన్ని బట్టి 4 సంవత్సరాల వరకు సంవత్సరానికి రూ. 60,000 వరకూ ఇస్తారు.
డ్రైవర్ల పిల్లల కోసం సాక్షం స్కాలర్‌షిప్ ప్రోగ్రాం
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు , కేరళ , తెలంగాణకు చెందిన డ్రైవర్ల పిల్లలకు మహీంద్రా ఫైనాన్స్ ఈ స్పెషల్ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ‘సాక్షం స్కాలర్‌షిప్ ప్రోగ్రాం’కి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్ల పిల్లలు అర్హులు. అన్ని లైట్ మోటారు వాహనాలు, టాక్సీ, జీప్, కార్, పికప్, డెలివరీ వ్యాన్‌లు, మ్యాజిక్, స్కూల్ వ్యాన్.. లాంటి వాహనాల డ్రైవర్ల పిల్లలు అప్లై చేయవచ్చు.
అయితే స్టూడెంట్స్ మెరిట్ ఉండి ఆర్థికంగా వెనుకబడిన వారై ఉండాలి. క్లాస్ 1 నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ చదివేవారికి స్కాలర్‌షిప్ ఇస్తారు. 9వ తరగతికి పైన చదువుతున్న అభ్యర్థులు మునుపటి ఫైనల్ పరీక్షలో 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక కుటుంబ ఆదాయం తప్పనిసరిగా రూ. 4లక్షలకు మించకూడదు. https://synergieinsights.in/saksham/home/Application ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. ఇందుకు చివరి తేదీ డిసెంబర్ 31 వరకు ఉంది. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ. 5,000 నుండి రూ.20,000 వరకు స్టైఫండ్ లభిస్తుంది.
HDFC కడమ్ స్కాలర్‌షిప్
ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ స్టూడెంట్స్ చదువులకు సాయం చేయడానికి HDFC బడ్తే కదమ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. 11వ తరగతి నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ (జనరల్ మరియు ప్రొఫెషనల్) చదువుతున్న భారతీయ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు అర్హులు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, డిప్లొమా/ఐటిఐ, వృత్తి విద్యా కోర్సులను అభ్యసిస్తున్న 11-12 తరగతుల్లోని వైకల్యం ఉన్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే గుర్తింపు పొందిన కోచింగ్ సంస్థల్లో NEET, JEE, CLAT మరియు NIFT వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
అయితే అభ్యర్థులు ముందు సంవత్సరం పరీక్షల్లో కనీసం 60% మార్కులు పొందాలి. అదే కోచింగ్ విద్యార్థులు 80% మార్కులు పొంది ఉండాలి. వికలాంగ విద్యార్థులకు కనీస మార్కులు అవసరం లేదు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం అంతా కలిపి రూ.6లక్షలకు మించకూడదు. వికలాంగ విద్యార్థులకైతే కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షల కంటే తక్కువ ఉండాలి. స్టూడెంట్స్ www.b4s.in/it/HTPF12 పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే, నవంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఎంపికైన వారికి రూ. 1లక్ష వరకు స్కాలర్‌షిప్ అందుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Scholarship