వరల్డ్ సైన్స్ డే సందర్భంగా, రీసెర్చ్ చేసే మహిళలకు గొప్ప అవకాశం లభించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ వంటి స్టెమ్ (STEM) కోర్సులు చదువుతున్న మహిళల కోసం స్కాలర్షిప్, మెంటరింగ్ ప్రోగ్రామ్ అందుబాటులోకి వచ్చింది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(RICH), బయోకాన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాకర్చరింగ్ సర్వీసెస్ కంపెనీ సింజీన్ ఇంటర్నేషనల్ ఈ అవకాశాన్ని అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని సింజీన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ఇనిషియేటివ్‌లో భాగంగా తీసుకొచ్చారు. ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించడం, స్కాలర్షిప్లను స్పాన్సర్ చేయడం ద్వారా కంపెనీ సపోర్ట్ చేస్తుంది.
టైర్ 2, 3 సంస్థలలో STEM సబ్జెక్టులను అభ్యసిస్తున్న మహిళలు, ప్రోగ్రాం కింద సెలక్ట్ అయితే రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లేదా కంపెనీలలో రీసెర్చ్ ప్రాజెక్టులపై పని చేయడానికి అవకాశం లభిస్తుంది. స్కాలర్‌షిప్‌తో పాటు, మెంటారింగ్ సపోర్ట్‌ను కూడా లభిస్తుంది. ప్రోగ్రామ్ మొదటి సంవత్సరంలో 25 స్కాలర్షిప్లు అందజేస్తున్నారు. కాలక్రమేణా STEM సబ్జెక్టులను అభ్యసించే మహిళల సంఖ్యను పెంచడం, STEMలో మహిళా నిపుణుల సెల్ఫ్- సస్టైనింగ్ నెట్‌వర్క్‌ను సృష్టించే లక్ష్యంతో ప్రోగ్రాం లాంచ్ చేశారు.
Future Engineers: అమెజాన్ ప్యూచర్ ఇంజినీర్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. విద్యార్థినులకు రూ.1.6 లక్షల స్కాలర్షిప్
3 నుంచి 6 నెలలపాటు సపోర్ట్
బయోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల స్వచ్ఛంద సంస్థ రిచ్, బయోకాన్ ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి పార్ట్నర్షిప్ అందిస్తున్నాయి. దీనిని టి-హబ్‌లో జరిగిన కార్యక్రమంలో రూపొందించినట్లు సైజీన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, రిచ్ సీఈవో రష్మీ పింపాలే, సింజీన్ ఇంటర్నేషనల్ సీఓఓ మహేశ్ బల్గట్, బయోకాన్ ఫౌండేషన్ మిషన్ డైరెక్టర్ అనుపమ శెట్టి పాల్గొన్నారు.
ఎంపిక ప్రక్రియలో భాగంగా, RICH, Syngene, Biocon ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, WE హబ్‌తో భాగస్వామ్యం ద్వారా ప్రస్తుతం టైర్ 2, 3లో సంస్థల్లో STEM సబ్జెక్టులలో విద్యను అభ్యసిస్తున్న మహిళలకు పెద్ద సంఖ్యలో చేరువైంది. అభ్యర్థులు హ్యాకథాన్లలో పాల్గొనడం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అందిన దరఖాస్తుల ఆధారంగా 25 మంది మహిళలను నిపుణుల కమిటీ ఎంపిక చేసింది. అభ్యర్థులు 3-6 నెలల పాటు స్పాన్సర్షిప్, మెంటార్షిప్ అందుకోనున్నారు.
ఈ ప్రోగ్రామ్ గురించి భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ జాతీయ విద్యా విధానం ‘యాక్సెస్’ లక్ష్యాలను సాధించడానికి వివిధ కార్యక్రమాలు పని చేస్తున్నాయని చెప్పారు. మహిళలకు STEM విద్యా అవకాశాలను చేరువ చేయడానికి ప్రోగ్రామ్ లాంచ్ చేసిన RICH, Syngene International, హైదరాబాద్ S&T క్లస్టర్‌ను PSA కార్యాలయం తరఫున అభినందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మహిళా సాధికారతకు మరో ముందడుగు వేసినట్లు తెలిపారు. STEM సంబంధిత రంగాల్లో మహిళలకు మరిన్ని అవకాశాలను కల్పించడానికి ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Scholarships, WOMAN