హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Scholarship: ఆ స్కాలర్‌షిప్ గడువు పొడిగింపు.. గెలుపొందిన విద్యార్థులు రూ.2 లక్షలు పొందే అవకాశం..

Scholarship: ఆ స్కాలర్‌షిప్ గడువు పొడిగింపు.. గెలుపొందిన విద్యార్థులు రూ.2 లక్షలు పొందే అవకాశం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ అనుబంధ సంస్థ అయిన LSAC గ్లోబల్.. జస్టిస్ ఎస్సే స్కాలర్‌షిప్ గడువు తేదీని పొడిగించింది. ‘జస్టిస్ షమ్నాద్ బహీర్ ఎస్సే స్కాలర్‌షిప్’ కోసం వ్యాసాన్ని సమర్పించే తేదీని సంస్థ జూన్ 10, 2022 వరకు పొడిగించింది.

ఇంకా చదవండి ...

లా స్కూల్ అడ్మిషన్(Admission) కౌన్సిల్ అనుబంధ సంస్థ అయిన LSAC గ్లోబల్.. జస్టిస్ ఎస్సే స్కాలర్‌షిప్(Scholarship) గడువు తేదీని పొడిగించింది. ‘జస్టిస్ షమ్నాద్ బహీర్ ఎస్సే స్కాలర్‌షిప్’ కోసం వ్యాసాన్ని సమర్పించే తేదీని సంస్థ జూన్ 10, 2022 వరకు పొడిగించింది. స్కాలర్‌షిప్ పోటీల్లో విజేతలకు రూ. 2లక్షల నగదు ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్(E Mail) ద్వారా దరఖాస్తు(Application) చేసుకోవాలని LSAC గ్లోబల్ తెలిపింది. 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ వ్యాసాలను సమర్పించడానికి తగిన సమయాన్ని అందించడం కోసం LSAC గ్లోబల్ చర్యలు తీసుకుంది.

జస్టిస్ ఎస్సే స్కాలర్‌షిప్‌ పొందాలంటే షామ్నాద్ బషీర్ యాక్సెస్ వ్యాస పోటీలో పాల్గొనాలి. ఈ ఏడాది "సోషల్ మీడియా ప్రభావం - ఇది కలుపుకొని పోవడాన్ని ప్రోత్సహిస్తుందా లేదా అంతరాన్ని పెంచుతుందా?" అనే అంశంపై విద్యార్థులు టాపిక్‌కు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వాదిస్తూ ఒక వ్యాసాన్ని జూన్ 10, 2022లోపు ఈ మెయిల్ ద్వారా ఎంట్రీ కోసం పంపాలి.

LSAC గ్లోబల్‌కు చెందిన లా అలయన్స్ కాలేజీలో ఐదేళ్ల లా ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునే LSAT- భారత అభ్యర్థులు మాత్రమే ఈ వ్యాస పోటీలో పాల్గొనడానికి అర్హులు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు స్కాలర్‌షిప్‌లను అందుకుంటారు. విజేతకు రూ. 2లక్షలు, మొదటి, రెండో రన్నరప్‌కు రూ.1 లక్ష చొప్పున స్కాలర్‌షిప్ రూపంలో ఇవ్వనున్నారు.

Health Insurance: తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు.. ఆయుష్మాన్ భారత్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..


LSAC గ్లోబల్ లా అలయన్స్ కాలేజీల్లో ఐదేళ్ల లా ప్రోగ్రామ్‌లో భాగంగా మొదటి సంవత్సరం ట్యూషన్, బోర్డింగ్/హాస్టల్ ఫీజులను కూడా ఈ స్కాలర్‌షిప్‌లు కవర్ చేస్తాయి. మరింత సమాచారం కోసం https://www.discoverlaw.in/scholarship-opportunities లింక్‌పై క్లిక్ చేసి LSAC గ్లోబల్‌ని సందర్శించవచ్చు.

మరోవైపు, LSAC గ్లోబల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లా డిగ్రీని సంపాదించడం వల్ల మీదపడే ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం న్యాయవాదులకు స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. అంతేకాకుండా ఏప్రిల్-మే 2022లో దరఖాస్తు చేసుకోవడానికి పలు సంస్థలు స్కాలర్‌షిప్, ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెడుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

గూగుల్ PHD ఫెలోషిప్ ఇండియా ప్రోగ్రామ్ 2022

Ph.D స్కాలర్స్‌కు మద్దతు ఇవ్వడం కోసం Google ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. భవిష్యత్తు సాంకేతికతను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే అభ్యర్థుల కోసం ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టారు.

అర్హతలు

ఇండియన్ యూనివర్సిటీల నుండి అండర్ గ్రాడ్యుయేట్/మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం PhD ప్రోగ్రామ్‌ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌ పొందేందుకు అర్హులు. అదేవిధంగా అభ్యర్థులు తప్పనిసరిగా భారతదేశంలో నమోదైన సంస్థలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అయి ఉండాలి. గూగూల్ ఫెలోషిప్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా మే 18, 2022గా నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం యూఆర్‌ఎల్ https://research.google/outreach/phd-fellowship/ సందర్శించండి.

లేడీ మెహెర్‌బాయి డి టాటా ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ 2022

టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా లేడీ మెహెర్‌బాయి డి టాటా ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్‌లు మంజూరు కానున్నాయి. నిర్దేశిత రంగాలలో విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ మహిళా గ్రాడ్యుయేట్‌ల కోసం ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.

అర్హతలు

టాప్ యూనివర్సిటీల్లో చదివి మెరిట్ సాధించిన భారత మహిళా గ్రాడ్యుయేట్లు ఈ స్కాలర్‌షిప్‌లకు అర్హులు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా కనీసం 2 సంవత్సరాల సంబంధిత వర్క్ ఎక్స్ పీరియన్స్‌తో 2022- 2023 సంవత్సరానికి యునైటెడ్ స్టేట్స్, UK లేదా యూరప్‌లోని టాప్ యూనివర్సిటీలు లేదా సంస్థల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి లేదా అప్పటికే అడ్మిషన్ కలిగి ఉండాలి. ఈ స్కాలర్ షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 2,2022గా నిర్ణయించారు. అప్లికేషన్‌ను ఇమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు https://www.tatatrusts.org/home/index యూఆర్ఎల్‌పై క్లిక్ చేయండి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Jee main 2022, Scolarships, Students

ఉత్తమ కథలు