హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Scholarship: కంప్యూట‌ర్ సైన్స్ చ‌దువుతున్నారా..? అయితే ఈ స్కాల‌ర్‌షిప్ మీ కోస‌మే

Scholarship: కంప్యూట‌ర్ సైన్స్ చ‌దువుతున్నారా..? అయితే ఈ స్కాల‌ర్‌షిప్ మీ కోస‌మే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Scholarship: విద్యార్థులు బాగా చ‌దువు కొనేంద‌కు ఎన్నో స్కాల‌ర్‌షిప్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి స్కాల‌ర్‌షిప్ ఏ గూగుల్ (Google) స్కాల‌ర్‌షిప్. కంప్యూట‌ర్ సైన్స్ చేస్తున్న విద్యార్థుల కోసం ఈ స్కాల‌ర్‌షిప్ అందిస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

కంప్యూటర్ సైన్స్‌ (Computer Science)లో చ‌దివే మ‌హిళ‌ల‌కు గూగుల్ (Google) స్కాల‌ర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆసియా-పసిఫిక్ నుంచి వచ్చిన మహిళల కోసం మాత్ర‌మే ప్రారంభించారు. కాబట్టి భారతీయ విద్యార్థినులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు (Application) చేసుకోవ‌చ్చు. కంప్యూటర్ సైన్స్‌లో మహిళల (Women) కోసం జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ (Scholarship) టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను అభ్యసించడానికి విద్యార్థులకు సాయం అందిస్తుంది. ఎంపికైన విద్యార్థులు 2022-2023 విద్యా సంవత్సరానికి $1000 (రూ.74191.35) విలువైన స్కాలర్‌షిప్‌లను అందుకుంటారు. ఈ స్కాల‌ర్‌షిప్ ద్వారా కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివే వారిని మ‌రింత ప్రోత్స‌హించాల‌నేది గూగుల్ ల‌క్ష్యం. ఈ స్కాల‌ర్‌షిప్ విద్యార్థి ప‌నితీరు ఆధారంగా ఇస్తారు. ఈ ఇంట‌ర్న్‌షిప్ ప్రోగ్రాంకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఎవ‌రు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు..

జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పొందేందుకు అర్హతలు

- ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు 2021-2022 విద్యాసంవ‌త్స‌రంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో నమోదు అయి ఉండాలి.

CSIR-NGRI Recruitment: హైద‌రాబాద్ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు.. జీతం రూ.1,16, 398.. ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకోండి


- ఆసియా-పసిఫిక్ దేశంలో గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యం విద్యార్థి అయి ఉండాలి.

- అభ్య‌ర్థి కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా దగ్గరి సంబంధం ఉన్న సాంకేతిక రంగం విద్య‌న‌భ్య‌సిస్తూ ఉండాలి.

- మంచి అక‌డ‌మిక్ మార్కులు క‌లిగి ఉండాలి.

అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు..

- ద‌ర‌ఖాస్తు దారు విద్యా సంవ‌త్స‌రంలో టెక్నిక‌ల్‌ ప్రాజెక్ట్‌లను మరియు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలలో అతని నేపుణ్యాన్ని తెలిపేలా రెజ్యూమ్/CVని క‌లిగి ఉండాలి.

- ప్రస్తుత లేదా (ఏదైనా ఉంటే) మునుపటి సంస్థల నుంచి అకడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్.

- అభ్యర్థులు రెండు 400 పదాల వ్యాసాలను కూడా సమర్పించాలి. వ్యాసాలు ఆంగ్లంలో రాయాలి.

- ఈ వ్యాసాలు ఈక్విటీ, వైవిధ్యం, చేరిక మరియు ఆర్థిక అవసరాల పట్ల అభ్యర్థి నిబద్ధత, సామ‌ర్థ్యంపై అంచనా వేస్తాయి.

TCS Online Courses: రెజ్యూమె రైటింగ్ తెలియ‌ట్లేదా..? ఇంట‌ర్వ్యూ స్కిల్స్ నేర్చుకోవాల‌నుకొంటున్నారా? అయితే ఈ ఉచిత కోర్సులు ట్రై చేయండి


ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

Step 1 - ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Step 2 -  ముందుగా https://buildyourfuture.withgoogle.com/scholarships/ లింక్‌లోకి వెళ్లాలి.

Step 3 - అందులో Generation Google Scholarship (Asia Pacific) లింక్‌ను ఎంచుకోవాలి.

Step 4 - ఇన్‌స్ట్ర‌క్ష‌న్‌ల‌ను పూర్తిగా చ‌దివి Apply Now ఆప్ష‌న్ క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తుప్రారంభించాలి.

Step 5 - ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

సాంకేతిక విద్య‌లో మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి ఈ స్కాల‌ర్‌షిప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. విద్యార్థుల ఎంపిక‌లో కంపెనీదే పూర్తి బాద్య‌త‌. స్కాల‌ర్‌షిప్ నేరుగా విద్యార్థి ఖాతాలో ప‌డుతాయి. ఆస‌క్తిగల విద్యార్థినులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

First published:

Tags: EDUCATION, Google, Scholarships

ఉత్తమ కథలు