Home /News /jobs /

SCHOLARSHIP AND FELLOWSHIP PROGRAMMES FOR STUDENTS SHOULD APPLY IN JUNE JULY UMG GH

Scholarships: విద్యార్థులకు సువర్ణావకాశం.. స్కాలర్‌షిప్, ఫెలోషిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

స్కాలర్‌షిప్, ఫెలోషిప్ పొందేందుకు విద్యార్థులకు మంచి అవకాశం.

స్కాలర్‌షిప్, ఫెలోషిప్ పొందేందుకు విద్యార్థులకు మంచి అవకాశం.

ఎడ్యుకేషన్ ఇటీవల కాలంలో చాలా ఖరీదుగా మారింది. దీంతో చాలా మంది విద్యార్థులు (Students) మెరిట్ ఉన్నా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు స్కాలర్‌షిప్‌‌ల (scholarship)ను అందిస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయి.

ఇంకా చదవండి ...
Education ఇటీవల కాలంలో చాలా ఖరీదుగా మారింది. దీంతో చాలా మంది విద్యార్థులు మెరిట్ ఉన్నా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు scholarshipను అందిస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయి. విద్యార్థుల అర్హతలు, వయస్సు ఆధారంగా అందించే ఆర్థిక సహాయమే స్కాలర్‌షిప్‌‌లు. కొన్నిటికీ వేర్వేరు అర్హత ప్రమాణాలు ఉండవచ్చు. జూన్-జూలై -2022లో దరఖాస్తు చేసుకోవడానికి అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

FAEA స్కాలర్‌షిప్ 2022-23
FAEA స్కాలర్‌షిప్‌లను ఫౌండేషన్ ఫర్ అకడమిక్ ఎక్సలెన్స్ అండ్ యాక్సెస్ ఆఫర్ చేస్తోంది.
12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి ఆర్ట్స్/కామర్స్/సైన్స్/ఇంజినీరింగ్ లేదా ఇతర సాంకేతిక- వృత్తిపరమైన విభాగాల్లో మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు http://www.faeaindia.org/ యూఆర్‌ఎల్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో జూన్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఇదీ చదవండి: జేఈఈ అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. ఇంకా ఏమేం చెక్ చేసుకోవాలంటే..?


ఉన్నతి (UNNATI): టువర్డ్స్ ఏ బెటర్ ఫ్యూచర్ స్కాలర్‌షిప్
CNH ఇండస్ట్రియల్.. 8 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులతో పాటు ఐటీఐ/Diploma కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న నిరుపేద విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత ప్రమాణాలు
నోయిడా, ఢిల్లీ, గురుగ్రామ్‌లో నివస్తున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు తప్పనిసరిగా 8 నుంచి 10 తరగతి లేదా ITI/డిప్లొమా ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలలోపు ఉండాలి.
ఎంపికై 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మూడేళ్లకు రూ.12000ల స్కాలర్‌షిప్‌ అందనుంది. అదే ఐటీఐ/డిప్లొమా విద్యార్థులకు రెండేళ్ల కోసం రూ. 18000 స్కాలర్‌షిప్‌ అందనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు www.b4s.in/it/UTBF2 అనే యూఆర్‌ఎల్ లింక్ ద్వారా ఆన్‌‌లైన్ లో జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఫుల్‌బ్రైట్ నెహ్రూ అకడెమిక్ అండ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ ఫెలోషిప్స్ 2023-24
పీహెచ్‌డీ/మాస్టర్స్ డిగ్రీ హోల్డర్ల కోసం యునైటెడ్ స్టేట్స్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (USIEF) ఈ ఫెలోషిప్స్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది.

అర్హత ప్రమాణాలు
భారతీయులతో పాటు అమెరికా జాతీయులు దరఖాస్తు చేసుకోవచ్చు. పీహెచ్‌డీ డిగ్రీతో పాటు కనీసం ఐదు సంవత్సరాల సంబంధిత విభాగంలో టీచింగ్/రీసెర్చ్/ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లేదా మాస్టర్స్ డిగ్రీ చేసి, సంబంధిత విభాగంలో కనీసం ఐదు సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అర్హత ఉన్న అభ్యర్థులు https://www.usief.org.in/Fulbright-Nehru-Academic-Professional-Excellence-Fellowships.aspxLive యూఆర్‌ఎల్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో జూలై 15లోపు దరఖాస్తు చేసుకోవాలి.



GEV మెమోరియల్ మెరిట్ స్కాలర్‌షిప్ 2022-23
GEV స్కాలర్‌షిప్ ఫండ్ ట్రస్ట్.. అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో లా కోర్సులు చేస్తున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత ప్రమాణాలు
దేశంలో గుర్తింపు పొందిన న్యాయ సంస్థల్లో LLB/LLM డిగ్రీ కోర్సులో ఇప్పటికే ఏదో ఒక సంవత్సరంలో ఎన్‌రోల్ అయి ఉండాలి. లేదా CLAT, LSAT-India, AILET కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో వారు కనీసం 60% స్కోర్ చేసి ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా రూ.10 లక్షల లోపు ఉండాలి. ఈ స్కాలర్‌షిప్‌‌లకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ. 50వేల నుంచి 2 లక్షల వరకు అందుకోనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు www.b4s.in/it/GMM4 యూఆర్‌ఎల్ లింక్ ద్వారా ఆన్ లైన్‌లో జూన్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Fellowship, JOBS, Scholarship

తదుపరి వార్తలు