Singareni Jobs 2021: సింగరేణిలో 372 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం... అప్లై చేయండిలా

Singareni Jobs 2021: సింగరేణిలో 372 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం... అప్లై చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

Singareni Jobs 2021 | సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్-SCCL 372 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్-SCCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్ ఎగ్జిక్యూటీవ్ కేడర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 372 ఖాళీలను ప్రకటించింది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు 2021 జనవరి 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 4 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://scclmines.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

    SCCL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 372
    ఫిట్టర్- 128
    ఎలక్ట్రీషియన్- 51
    వెల్డర్- 54
    టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రైనీ- 22
    మోటార్ మెకానిక్ ట్రైనీ- 14
    ఫౌండర్ మెన్ లేదా ముల్డర్ ట్రైనీ- 19
    జూనియర్ స్టాఫ్ నర్స్- 84

    SSC CGL Notification 2021: డిగ్రీ పాసయ్యారా? 6506 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి... సిలబస్ ఇదే

    RBI Recruitment 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 241 ఉద్యోగాలు

    SCCL Recruitment 2021: విద్యార్హతల వివరాలు ఇవే...


    ఫిట్టర్- 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్‌లో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
    ఎలక్ట్రీషియన్- 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్‌లో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
    వెల్డర్- 10వ తరగతి పాస్ కావడంతో పాటు వెల్డర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్‌లో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
    టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రైనీ- 10వ తరగతి పాస్ కావడంతో పాటు టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్‌లో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
    మోటార్ మెకానిక్ ట్రైనీ- 10వ తరగతి పాస్ కావడంతో పాటు మోటార్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్‌లో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
    ఫౌండర్ మెన్ లేదా ముల్డర్ ట్రైనీ- 10వ తరగతి పాస్ కావడంతో పాటు మౌల్డర్ ట్రేడ్ లేదా ఫౌండ్రీ మ్యాన్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్‌లో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
    జూనియర్ స్టాఫ్ నర్స్- ఇంటర్మీడియట్ పాస్ కావడంతో పాటు జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. లేదా బీఎస్‌సీ నర్సింగ్ పాస్ కావాలి.

    Extra Income: జీతం సరిపోవట్లేదా? ఈ 11 మార్గాల ద్వారా మరింత డబ్బు సంపాదించండి

    Railway Concessions: విద్యార్థులు, నిరుద్యోగులకు రైలులో ఉచిత ప్రయాణం, టికెట్లలో రాయితీ... ఎవరికి ఎంతంటే

    SCCL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 22
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటలు
    వయస్సు- 18 నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు.

    SCCL Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా https://scclmines.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో CAREERS సెక్షన్‌లో Recruitment పైన క్లిక్ చేయాలి.
    అందులో Notification పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత Click here for Details & Apply Online పైన క్లిక్ చేయాలి.
    Please Click here for a copy of Detailed Notification పైన క్లిక్ చేయాలి.
    నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
    ఆ తర్వాత Apply Online పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత అప్లై చేయాలనుకున్న పోస్టును సెలెక్ట్ చేయాలి.
    పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
    దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: