Home /News /jobs /

SC JUNIOR COURT ASSISTANT RECRUITMENT OPEN FOR GRADUATES SALARY UP TO RS 63068 UMG GH

Jobs Alert: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. శాలరీ ఎంతంటే..!

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్(గ్రూప్ బి, నాన్-గెజిటెడ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sci.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఇంకా చదవండి ...
భారత అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) సుప్రీంకోర్టు.. జూనియర్ కోర్ట్ (Junior Court) అసిస్టెంట్(గ్రూప్ బి, నాన్-గెజిటెడ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ (Notification) జారీ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sci.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 10గా నిర్ణయించింది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలు తెలుసుకుందాం.

ఎంపిక ప్రక్రియ
జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల కోసం.. ముందుగా అభ్యర్థులకు జనరల్ ఆబ్జెక్టివ్ రిటన్ టెస్ట్, కంప్యూటర్ నాలెడ్జ్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత, కంప్యూటర్‌లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిస్క్రిప్టివ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. దీంట్లో క్వాలిఫై అయిన వారికి తుది ఎంపిక కోసం ఇంటర్వ్యూ రౌండ్ నిర్వహిస్తారు.

అర్హత ప్రమాణాలు
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అలాగే 35 w.p.m మినిమం స్పీడ్‌తో ఇంగ్లిష్ టైపింగ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి.

వయోపరిమితి
జులై 1, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST/OBC/ఫిజికలీ ఛాలెంజ్డ్/ఎక్స్ సర్వీస్‌మెన్, స్వాతంత్ర్య సమరయోధులపై ఆధారపడినవారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం

స్టెప్-1: సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్ https://main.sci.gov.in ను సందర్శించాలి.

స్టెప్-2: జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఇన్ సుప్రీంకోర్టు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్-3: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పేజీ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

స్టెప్-4: అవసరమైన వివరాలతో అప్లికేషన్‌ను పూరించండి. ఆపై పరీక్ష ఫీజును చెల్లించండి.

స్టెప్-5: చివరగా అప్లికేషన్ సబ్‌మిట్ చేయండి.

స్టెప్-6: భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింటవుట్ తీసుకోండి.

అప్లికేషన్ ఫీజు
జనరల్/ఓబీసీ కేటగిరిలకు చెందిన అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనిక ఉద్యోగులు/పీహెచ్/ఫ్రీడం ఫైటర్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులైతే రూ. 250 ప్లస్ బ్యాంక్ ఛార్జీలను ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

జీతభత్యాలు
జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులకు HRAతో సహా ప్రస్తుత అలవెన్సుల రేటు ప్రకారం సుమారు గ్రాస్ శాలరీ నెలకు రూ. 63,068గా ఉండనుంది. (ప్రీ-రివైజ్డ్ పే స్కేల్ PB-2తో గ్రేడ్ పే రూ. 4,200)

మరోవైపు, బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా రిక్రూట్‌మెంట్ ద్వారా డిప్యూటి వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజనీర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 7, 2022గా నిర్ణయించారు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Government jobs, JOBS, Supreme Court

తదుపరి వార్తలు