హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Free Training: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఫ్రీగా బైక్ మెకానిక్ ట్రైనింగ్.. వివరాలివే

Free Training: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఫ్రీగా బైక్ మెకానిక్ ట్రైనింగ్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పురుషులకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా టూ వీలర్ మెకానిక్ లో నెలరోజుల పాటు ఉచిత శిక్షణకు ఇవ్వనున్నట్లు స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం ( SBRSETI) డైరెక్టర్ వంగా రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi) | Medak

గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న యువకులకు  స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం ( SBRSETI) గుడ్ న్యూస్ చెప్పింది. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా టూ వీలర్ మెకానిక్ లో నెలరోజుల పాటు ఉచిత శిక్షణకు (free coaching) ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ వంగా రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మునిసిపాలిటీ పరిధిలో నివసించే వారు ఈ శిక్షణ కు అర్హులు కారని ఆయన వెల్లడించారు.

అర్హతలు:

తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి 18- 45 ఏళ్ల వయస్సు కలిగిన యువకులు దరఖాస్తుకు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, 4 పాస్ ఫొటోలతో సంప్రదించాలని సూచించారు.

ఎలా సంప్రదించాలంటే?

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం, బైపాస్ రోడ్, సంగారెడ్డి , ఫోన్: 08455 271321 ను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులు, ఇతర వివరాలకు 9490103390, 94901 29839 నంబర్లను సంప్రదించాలన్నారు. జనవరి 18 నుండి నెల రోజులపాటు ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు.

శిక్షణ, వసతి, భోజనం ఫ్రీ:

ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ, వసతి, భోజనం పూర్తిగా ఉచితమని ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్ , సంగారెడ్డి జిల్లా వాసులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. యువకులకు టూ వీలర్ మెకానిక్ లో నైపుణ్య శిక్షణ తోపాటు వ్యాపార నిర్వాహణ అభివృద్ధి, ఖాతాల నిర్వహణ సంభాషణ నైపుణ్యాల లో శిక్షణ ఉంటుందని ప్రకటనలో తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత టూ వీలర్ మెకానిక్ కిట్టు ఇవ్వబడుతుందన్నారు.

First published:

Tags: Career and Courses, EMPLOYMENT, Free coaching, JOBS, Private Jobs

ఉత్తమ కథలు