Home /News /jobs /

SBI SO Recruitment 2021: రూ.2,00,000 వరకు వేతనంతో ఎస్‌బీఐలో 606 ఉద్యోగాలు... మేనేజర్ పోస్టులకు అప్లై చేయండిలా

SBI SO Recruitment 2021: రూ.2,00,000 వరకు వేతనంతో ఎస్‌బీఐలో 606 ఉద్యోగాలు... మేనేజర్ పోస్టులకు అప్లై చేయండిలా

SBI SO Recruitment 2021: రూ.2,00,000 వరకు వేతనంతో ఎస్‌బీఐలో 606 ఉద్యోగాలు... మేనేజర్ పోస్టులకు అప్లై చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

SBI SO Recruitment 2021: రూ.2,00,000 వరకు వేతనంతో ఎస్‌బీఐలో 606 ఉద్యోగాలు... మేనేజర్ పోస్టులకు అప్లై చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI SO Recruitment 2021 | బ్యాంకు ఉద్యోగాలు (Bank Jobs) కోరుకునేవారికి శుభవార్త చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). వేర్వేరు విభాగాల్లో 606 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీగా పోస్టుల్ని భర్తీ చేసేందుకు మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ ఈ నోటిఫికేషన్ ద్వారా 606 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులతో పాటు కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్, రిలేషన్‌షిప్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మూడు నోటిఫికేషన్లను వేర్వేరుగా రిలీజ్ చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా వేర్వేరుగా ఉంది. 2021 అక్టోబర్ 18 లోగా అప్లై చేయాలి. ఎగ్జిక్యూటీవ్, రిలేషన్‌షిప్ మేనేజర్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    SBI SO Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...













































    మొత్తం ఖాళీలు 606
    రిలేషన్‌షిప్ మేనేజర్ 314
    రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) 20
    కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్ 217
    ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ 12
    సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్) 2
    సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్) 2
    మేనేజర్ (మార్కెటింగ్) 12
    డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) 26
    ఎగ్జిక్యూటీవ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్ ఆర్కైవ్స్) 1

    APPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్... 151 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్

    ఈ పోస్టులకు ఎంపికైనవారికి నెలకు రూ.2,00,000 వరకు వేతనం లభిస్తుంది. దరఖాస్తు చేసేముందు విద్యార్హతల వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలి. పూర్తి వివరాలను https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/web/careers వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు, విద్యార్హతలు, వేతనాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మేనేజర్, డిప్యూటీ మేనేజర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ONGC Recruitment 2021: ఓఎన్​జీసీలో 313 ఉద్యోగాలకు నోటిఫికేషన్... పరీక్ష లేకుండా జాబ్

    SBI SO Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


    అభ్యర్థులు మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి https://ibpsonline.ibps.in/sbiscosep21/ లింక్ ఓపెన్ చేయాలి.
    కుడివైపు టాప్‌లో ఉన్న Click here for New Registration పైన క్లిక్ చేయాలి.
    మీ పేరు, పుట్టిన తేదీ లాంటి బేసిక్ వివరాలు ఎంటర్ చేయాలి.
    ఆ తర్వాత మీ ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
    ఆ తర్వాత ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
    వివరాలన్నీ ఓసారి చెక్ చేయాలి.
    ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
    అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank Jobs 2021, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, Sbi, State bank of india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు