SBI SO Recruitment 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 ఉద్యోగాలు... దరఖాస్తుకు 5 రోజులే గడువు

SBI SO Recruitment 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 ఉద్యోగాలు... దరఖాస్తుకు 5 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

SBI SO Recruitment 2021 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఓ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా 606 ఖాళీలను ప్రకటించింది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 606 ఖాళీలను భర్తీ చేయనుంది. మేనేజర్, డిప్యూటీ మేనేజర్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్, రిలేషన్‌షిప్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఎస్‌బీఐ వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ మూడు నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ కూడా వేర్వేరుగా ఉంది. అభ్యర్థులు 2021 అక్టోబర్ 18 లోగా అప్లై చేయాలి. ఎగ్జిక్యూటీవ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్ ఆర్కైవ్స్), రిలేషన్‌షిప్ మేనేజర్, రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్), కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్), సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్) పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

    IBPS Recruitment 2021: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు... రూ.1,66,000 వరకు వేతనం

    SBI SO Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...













































    మొత్తం ఖాళీలు 606
    రిలేషన్‌షిప్ మేనేజర్ 314
    రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) 20
    కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్ 217
    ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ 12
    సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్) 2
    సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్) 2
    మేనేజర్ (మార్కెటింగ్) 12
    డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) 26
    ఎగ్జిక్యూటీవ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్ ఆర్కైవ్స్) 1

    Lok Sabha Recruitment 2021: రూ.65,000 వరకు వేతనంతో లోక్‌సభలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

    ఈ పోస్టులకు ఎంపికైనవారికి రూ.45,00,000 వరకు వేతనం లభిస్తుంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు, విద్యార్హతలు, వేతనాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఎగ్జిక్యూటీవ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్ ఆర్కైవ్స్) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    రిలేషన్‌షిప్ మేనేజర్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    RBI Scholarship: ఆర్‌బీఐ నుంచి నెలకు రూ.40,000 స్కాలర్‌షిప్... అప్లై చేయండి ఇలా

    SBI SO Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి.

    Step 2- ఇతర పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయాలి.

    Step 3- Click for New Registration పైన క్లిక్ చేయాలి.

    Step 4- మొదటి పేజీలో పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి బేసిక్ వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 5- తర్వాతి పేజీలో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 6- తర్వాతి పేజీలో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 7- తర్వాతి పేజీలో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

    Step 8- ఓసారి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

    Step 9- పేమెంట్ పూర్తి చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

    Step 10- దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: