• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • SBI SO RECRUITMENT 2020 STATE BANK OF INDIA RELEASED JOB NOTIFICATIONS TO FILL 431 SPECIALIST OFFICER POSTS KNOW FULL DETAILS SS

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 431 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 431 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 431 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

SBI SO Recruitment 2020 | లాక్‌డౌన్ తర్వాత బ్యాంకింగ్ రంగంలో జాబ్ నోటిఫికేషన్ల హడావుడి మొదలైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI 431 పోస్టులతో వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీగా ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది ఎస్‌బీఐ. మొత్తం 431 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని ప్రకటించింది. సెంట్రల్ రీసెర్చ్ టీమ్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, రిలేషన్‌షిప్ మేనేజర్, ఫ్యాకల్టీ, డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్, ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 23న అంటే ఇవాళ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/web/careers వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    SBI SO Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 431
    ఎగ్జిక్యూటీవ్ (FI & MM) - 241
    సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (సోషల్ బ్యాంకింగ్ & సీఎస్ఆర్)- 85
    సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (డిజిటల్ రిలేషన్స్)- 2
    సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (అనలిటిక్స్)- 2
    సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (డిజిటల్ మార్కెటింగ్)- 2
    హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్, రీసెర్చ్)- 1
    సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ & డేటా అనలిటిక్స్)- 1
    సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్)- 1
    ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- 9
    ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (టెక్నాలజీ)- 1
    రిలేషన్‌షిప్ మేనేజర్ (బ్యాక్‌లాగ్)- 48
    రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)- 3
    ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్- 20
    ప్రొడక్ట్ మేనేజర్- 6
    మేనేజర్ (డేటా అనలిస్ట్)- 2
    మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్)- 1
    ఫ్యాకల్టీ, ఎస్‌బీఐఎల్, కోల్‌కతా- 3
    బ్యాకింగ్ సూపర్‌వైజరీ స్పెషలిస్ట్- 1
    మేనేజర్ ఎనీటైమ్ ఛానల్- 1
    వైస్ ప్రెసిడెంట్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 1
    చీఫ్ మేనేజర్ (స్పెషల్ సిచ్యూవేషన్ టీమ్)- 3
    డిప్యూటీ మేనేజర్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 3
    డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్- 1
    డిప్యూటీ మేనేజర్ (ఐఎస్ ఆడిట్)- 8
    చీఫ్ ఆఫీసర్ (సెక్యూరిటీ)- 1

    SBI SO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 23
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 13
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్లలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
    ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ
    దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
    మరిన్ని వివరాలకు https://www.sbi.co.in/web/careers/current-openings వెబ్‌సైట్ చూడండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్

    UPSC Jobs: డిఫెన్స్, నేవీలో 413 ఉద్యోగాలు... ఇంటర్ పాసైతే చాలు

    IAF Jobs: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 256 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ట్రైనింగ్
    First published:

    అగ్ర కథనాలు