SBI Jobs 2020: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే

SBI SO Recruitment 2020 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: September 19, 2020, 9:12 AM IST
SBI Jobs 2020: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే
SBI Jobs 2020: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్యాంకు ఉద్యోగం కోరుకుంటున్నారా? అర్హతలతో పాటు అనుభవం కూడా ఉందా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 92 ఖాళీలను ప్రకటించింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఇవి. రిస్క్, స్పెషలిస్ట్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/ లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 10 చివరి తేదీ. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

Jobs: హైదరాబాద్, వైజాగ్‌లోని బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో జాబ్స్... మరో 3 రోజులే ఛాన్స్

Police Jobs: టెన్త్ పాసైనవారికి 1522 కానిస్టేబుల్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SBI SO Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 92
రిస్క్ స్పెషలిస్ట్ సెక్టార్ (స్కేల్ 3)- 5
రిస్క్ స్పెషలిస్ట్ సెక్టార్ (స్కేల్ 2)- 5పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్ (స్కేల్ 2)- 3
రిస్క్ స్పెషలిస్ట్ క్రెడిట్ (స్కేల్ 3)- 2
రిస్క్ స్పెషలిస్ట్ క్రెడిట్ (స్కేల్ 2)- 2
రిస్క్ స్పెషలిస్ట్ ఎంటర్‌ప్రైజ్ (స్కేల్ 2)- 1
రిస్క్ స్పెషలిస్ట్ IND AS (స్కేల్ 2)- 4
డిప్యూటీ మేనేజర్ (డేటా సైంటిస్ట్)- 11
మేనేజర్ (డేటా సైంటిస్ట్)- 11
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్ ఆఫీసర్)- 5
డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్- 1
పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో- 5
డేటా ట్రైనర్- 1
డేటా ట్రాన్స్‌లేటర్- 1
సీనియర్ కన్సల్టెంట్ అనలిస్ట్- 1
అసిస్టెంట్ జనరల్ మేనేజర్- 1
డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ)- 28
మేనేజర్ (రీటైల్ ప్రొడక్ట్స్)- 5

IBPS Clerk Jobs: మొత్తం 2557 క్లర్క్ పోస్టుల భర్తీ... తెలంగాణ, ఏపీలో ఖాళీల వివరాలివే

Flipkart: గుడ్ న్యూస్... 70,000 ఉద్యోగాలు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్... ఇంటర్, డిగ్రీ అర్హత

SBI SO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 18
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 10
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
Published by: Santhosh Kumar S
First published: September 19, 2020, 9:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading