SBI Jobs: గుడ్ న్యూస్... ఎస్‌బీఐలో 431 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

SBI Jobs: గుడ్ న్యూస్... ఎస్‌బీఐలో 431 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)

SBI SO Recruitment 2020 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయని అభ్యర్థులకు శుభవార్త. దరఖాస్తు గడువును పెంచింది ఎస్‌బీఐ.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 431 పోస్టుల్ని ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 జూలై 13 చివరి తేదీ అని నోటిఫికేషన్‌లో ప్రకటించింది ఎస్‌బీఐ. కానీ ఇప్పటివరకు దరఖాస్తు చేయనివారికి మరో అవకాశం ఇచ్చింది. దరఖాస్తు గడువును 2020 జూలై 15 వరకు పొడిగించింది. అంటే రేపటి లోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు ఫీజు చెల్లించాలి. కేవలం దరఖాస్తు గడువు మాత్రమే పొడిగించామని, నియమనిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని ఎస్‌బీఐ ప్రకటించింది. సెంట్రల్ రీసెర్చ్ టీమ్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, రిలేషన్‌షిప్ మేనేజర్, ఫ్యాకల్టీ, డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్, ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్ లాంటి 431 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/web/careers వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 292 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    GGH Kakinada Jobs: కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో 311 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే


    SBI SO Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 431
    ఎగ్జిక్యూటీవ్ (FI & MM) - 241
    సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (సోషల్ బ్యాంకింగ్ & సీఎస్ఆర్)- 85
    సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (డిజిటల్ రిలేషన్స్)- 2
    సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (అనలిటిక్స్)- 2
    సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (డిజిటల్ మార్కెటింగ్)- 2
    హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్, రీసెర్చ్)- 1
    సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ & డేటా అనలిటిక్స్)- 1
    సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్)- 1
    ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- 9
    ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (టెక్నాలజీ)- 1
    రిలేషన్‌షిప్ మేనేజర్ (బ్యాక్‌లాగ్)- 48
    రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)- 3
    ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్- 20
    ప్రొడక్ట్ మేనేజర్- 6
    మేనేజర్ (డేటా అనలిస్ట్)- 2
    మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్)- 1
    ఫ్యాకల్టీ, ఎస్‌బీఐఎల్, కోల్‌కతా- 3
    బ్యాకింగ్ సూపర్‌వైజరీ స్పెషలిస్ట్- 1
    మేనేజర్ ఎనీటైమ్ ఛానల్- 1
    వైస్ ప్రెసిడెంట్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 1
    చీఫ్ మేనేజర్ (స్పెషల్ సిచ్యూవేషన్ టీమ్)- 3
    డిప్యూటీ మేనేజర్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 3
    డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్- 1
    డిప్యూటీ మేనేజర్ (ఐఎస్ ఆడిట్)- 8
    చీఫ్ ఆఫీసర్ (సెక్యూరిటీ)- 1

    Bank Jobs: బ్యాంక్ జాబ్ మీ కలా? 9640 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఐబీపీఎస్

    DRDO Jobs: గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో 311 ఉద్యోగాలకు గడువు పెంపు

    SBI SO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 23
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 15
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్లలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
    ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ
    దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
    మరిన్ని వివరాలకు https://www.sbi.co.in/web/careers/current-openings వెబ్‌సైట్ చూడండి.
    Published by:Santhosh Kumar S
    First published: