SBI SCO RECRUITMENT 2022 STATE BANK OF INDIA INVITES APPLICATIONS FOR 22 SPECIALIST CADRE OFFICER POSTS KNOW HOW TO APPLY SS
SBI Recruitment 2022: ఎస్బీఐలో ఉద్యోగాలకు నాలుగు నోటిఫికేషన్లు... ఖాళీల వివరాలు ఇవే
SBI Recruitment 2022: ఎస్బీఐలో ఉద్యోగాలకు నాలుగు నోటిఫికేషన్లు... ఖాళీల వివరాలు ఇవే
(image: SBI)
SBI Recruitment 2022 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నాలుగు జాబ్ నోటిఫికేషన్ల ద్వారా 22 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. విద్యార్హతలు, దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notifications) విడుదల చేసింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (Specialist Cadre Officers) పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్ లాంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2022 జనవరి 13 చివరి తేదీ. హెడ్ (డిజిటల్ బ్యాంకింగ్) పోస్టుకు 2022 జనవరి 28 లోగా దరఖాస్తు చేయొచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అప్లై చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్లో పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
SBI Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు
22
విద్యార్హతలు
వేతనం
చీఫ్ మేనేజర్ (కంపెనీ సెక్రెటరీ)
2
ఎల్ఎల్బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎఫ్ఆర్ఎం పాస్ కావాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా సభ్యత్వం ఉండాలి.
రూ.76,010 బేసిక్ వేతనంతో మొత్తం రూ.89,890 వేతనం లభిస్తుంది.
మేనేజర్ (ఎస్ఎంఈ ప్రొడక్ట్స్)
6
ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా పీజీడీఎం లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ డిగ్రీ ఉండాలి. బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి.
రూ.76,010 బేసిక్ వేతనంతో మొత్తం రూ.89,890 వేతనం లభిస్తుంది.
డిప్యూటీ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్)
7
చార్టర్డ్ అకౌంటెంట్ సింగిల్ అటెంప్ట్‌లో పాస్ కావాలి.
రూ.48,170 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,810 వేతనం లభిస్తుంది.
అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్)
4
ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీడీఎం పాస్ కావాలి.
రూ.36,000 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,840 వేతనం లభిస్తుంది.
ఇంటర్నల్ అంబుడ్స్‌మ్యాన్
2
ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి.
వార్షికంగా రూ.36,00,000 వేతనం
హెడ్ (డిజిటల్ బ్యాంకింగ్)
1
బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. లేదా ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా పీజీడీఎం పాస్ కావాలి.
Step 5- తర్వాత దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి ఐదు స్టెప్స్ ఉంటాయి.
Step 6- మొదటి స్టెప్‌లో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
Step 7- రెండో స్టెప్‌లో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
Step 8- మూడో స్టెప్‌లో అభ్యర్థి అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
Step 9- నాలుగో స్టెప్‌లో అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
Step 10- ఐదో స్టెప్‌లో దరఖాస్తు ఫీజు పేమెంట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 11- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.