హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI: నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్‌న్యూస్.. భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి..

SBI: నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్‌న్యూస్.. భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి..

SBI SCO Recruitment

SBI SCO Recruitment

SBI: అర్హత ఉన్న అభ్యర్థులు bank.sbi/careers లేదా sbi.co.in/careers వెబ్‌సైట్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కాగా, సెప్టెంబర్ 20న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 665 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ కీలక రిక్రూట్‌మెంట్ (SBI Recruitment) నోటిఫికేషన్ జారీ చేసింది. వెల్త్ మేనేజ్‌మెంట్ బిజినెస్ కోసం భారీ స్థాయిలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ (SCO) పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హత ఉన్న అభ్యర్థులు (Candidates) bank.sbi/careers లేదా sbi.co.in/careers వెబ్‌సైట్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కాగా, సెప్టెంబర్ 20న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 665 ఖాళీలను భర్తీ చేయనున్నారు.* ఎస్‌బీఐ SCO రిక్రూట్‌మెంట్ తేదీలు
రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2022, ఆగస్టు31
రిజిస్ట్రేషన్ ముగింపు- 2022 సెప్టెంబర్ 20
* ఖాళీల వివరాలు
మేనేజర్ (బిజినెస్ ప్రాసెస్)- 1
సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్ సపోర్ట్- 2
మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్)- 2
ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (బిజినెస్)- 2
రిలేషన్‌షిప్ మేనేజర్- 335
ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- 52
సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్- 147
రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)- 37
రీజినల్ హెడ్- 12
కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ -75
* అర్హత ప్రమాణాలు
మేనేజర్ (బిజినెస్ ప్రాసెస్)
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీఏ/పీజీడీఎం చేసి ఉండాలి. బ్యాంక్/వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థలు/బ్రోకింగ్ సంస్థల్లో బిజినెస్ ప్రాసెస్‌లోని వెల్త్ మేనేజ్‌మెంట్ లో కనీసం 5 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.


సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్- సపోర్ట్
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ, ప్రైవేట్ బ్యాంకింగ్ లేదా వెల్త్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ ప్రొవైడర్లలో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇందులో వెల్త్ మేనేజ్‌మెంట్ బిజినెస్‌లో సెంట్రల్ ఆపరేషన్స్‌లో కనీసం రెండేళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్)
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ/పీజీడీఎం పూర్తి చేసి ఉండాలి. బ్యాంక్/వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థలు/బ్రోకింగ్ సంస్థలలో కనీసం 5 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.
ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (బిజినెస్)
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ/పీజీడీఎం చేసి ఉండాలి. బ్యాంక్/వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థలు/బ్రోకరేజ్ సంస్థలలో కనీసం 5 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.
ఇది కూడా చదవండి : వైకల్యం ఓడింది.. చూపు లేకున్నా రూ.47 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్.. ఇదే కదా అసలైన విజయం..
* ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉండనుంది. ఆన్‌లైన్ పరీక్ష 70% , ఇంటర్వ్యూ‌కు 30% వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ కావడానికి ఈ రెండు దశల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
* దరఖాస్తు ప్రక్రియ
స్టెప్-1: ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.inను సందర్శించాలి.
స్టెప్-2: హోమ్ పేజీలో కెరీర్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్-3: ‘జాయిన్ ఎస్‌బీఐ’ అనే లింక్‌పై క్లిక్ చేసి, కరెంట్ ఓపెనింగ్స్‌ ఆప్షన్ ఎంచుకోవాలి.
స్టెప్-4: వెల్త్ మేనేజ్‌మెంట్ బిజినెస్ కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన SBIలో స్పెషలిస్ట్ కేడర్ అధికారుల నియామకం అని ఉన్న ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-5: అప్లికేషన్ ఫారమ్‌ను నింపండి.
స్టెప్-6: అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయండి.
స్టెప్-7: అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తును సబ్‌మిట్ చేయండి.
* అప్లికేషన్ ఫీజు
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఇక, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, JOBS, Sbi, State bank of india

ఉత్తమ కథలు