స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే 489 పోస్టులకు ఓ నోటిఫికేషన్, 16 పోస్టులకు మరో నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్- మేనేజర్ (రీటైల్ ప్రొడక్ట్స్) పోస్టుల్ని ప్రకటించింది. 5 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు 2021 జనవరి 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్సైట్లో కెరీర్స్ సెక్షన్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ చదివిన తర్వాత విద్యార్హతలు ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయాలి. 2020 సెప్టెంబర్ 18న ఎస్బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు.
Singareni Jobs 2021: సింగరేణిలో 372 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం... అప్లై చేయండిలా
Common Eligibility Test: రైల్వే జాబ్స్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్... ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే
SBI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
మొత్తం స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్- మేనేజర్ (రీటైల్ ప్రొడక్ట్స్) ఖాళీలు- 5
దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 22
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 12
విద్యార్హతలు- ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా పీజీడీఎం లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ డిగ్రీ పాస్ కావాలి. ఫుల్ టైమ్ బీఈ, బీటెక్ పాస్ కావాలి.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
వయస్సు- 25 నుంచి 35 ఏళ్లు
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
SSC CGL Notification 2021: డిగ్రీ పాసయ్యారా? 6506 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి... సిలబస్ ఇదే
Railway Concessions: విద్యార్థులు, నిరుద్యోగులకు రైలులో ఉచిత ప్రయాణం, టికెట్లలో రాయితీ... ఎవరికి ఎంతంటే
SBI SCO Recruitment 2021: అప్లై చేయండి ఇలా
అభ్యర్థులు ముందుగా https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Apply Online పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
కొత్త పేజీలో Click for New Registration పైన క్లిక్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి.
ఆ తర్వాత స్టెప్‌లో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
మూడో స్టెప్‌లో క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
నాలుగో స్టెప్‌లో ఓసారి దరఖాస్తులో సబ్మిట్ చేసిన వివరాలన్నీ సరిచూసుకోవాలి.
చివరి స్టెప్‌లో పేమెంట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.