HOME »NEWS »JOBS & EDUCATION »sbi sco recruitment 2021 state bank of india released notification for 489 specialist cadre officer posts know vacancies and other details ss

SBI SCO Recruitment 2021: ఎస్‌బీఐలో 489 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SBI SCO Recruitment 2021: ఎస్‌బీఐలో 489 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
SBI SCO Recruitment 2021: ఎస్‌బీఐలో 489 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

SBI SCO Recruitment 2021 | బ్యాంకు ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 489 ఖాళీలున్నాయి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 489 ఖాళీలను ప్రకటించింది. వేర్వేరు విభాగాల్లో ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాలి. ఈ పోస్టులకు డిసెంబర్ 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 11 చివరి తేదీ. అభ్యర్థులకు ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

    RRB NTPC Admit Card: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా



    IOCL Recruitment 2020: ఐఓసీఎల్‌లో 543 ఉద్యోగాలు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు

    SBI SCO Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 489
    స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO ఫైర్- 16
    డిప్యూటీ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్)- 28
    మేనేజర్ (నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్)- 12
    అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)- 40
    డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)- 60
    అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్స్)- 183
    డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- 17
    ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్- 15
    ప్రాజెక్ట్ మేనేజర్- 14
    అప్లికేషన్ ఆర్కిటెక్ట్- 5
    టెక్నికల్ లీడ్- 2
    మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజర్స్)- 2
    మేనేజర్ మార్కెటింగ్- 40
    డిప్యూటీ మేనేజర్ మార్కెటింగ్- 35

    ECIL Hyderabad Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    SSC CGL 2020-21: డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్... నోటిఫికేషన్ వివరాలు ఇవే

    SBI SCO Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 22
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 11
    కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2021 జనవరి 22
    రాతపరీక్ష- 2021 ఫిబ్రవరి 1
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
    దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
    ఎంపిక విధానం- ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ
    పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం.
    Published by:Santhosh Kumar S
    First published:December 24, 2020, 11:15 IST

    टॉप स्टोरीज