బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జనవరి 11 లోగా అప్లై చేయాలి. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తుంది ఎస్‌బీఐ. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం పరీక్షా కేంద్రాలున్నాయి. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టులకు పోస్టుల వారీగా వేర్వేరు విద్యార్హతలున్నాయి. అభ్యర్థులు అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు ముందు అభ్యర్థుల దగ్గర పనిచేస్తున్న ఇమెయిల్ ఐడీ ఉండాలి.
BARC Recruitment 2021: ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తున్న బార్క్... మొత్తం 160 ఖాళీలు
Army Public School Jobs: హైదరాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
SBI SCO Recruitment 2021: అప్లై చేయండి ఇలా
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Apply Online పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
కొత్త పేజీలో Click for New Registration పైన క్లిక్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి.
ఆ తర్వాత స్టెప్‌లో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
మూడో స్టెప్‌లో క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
నాలుగో స్టెప్‌లో ఓసారి దరఖాస్తులో సబ్మిట్ చేసిన వివరాలన్నీ సరిచూసుకోవాలి.
చివరి స్టెప్‌లో పేమెంట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.