స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SBI Jobs) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ లాంటి పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఎస్బీఐ. మొత్తం 69 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు 2021 సెప్టెంబర్ 2 లోగా దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారికి రూ.78,000 వరకు వేతనం లభిస్తుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఖాళీల వివరాలు, దరఖాస్తు ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 69 |
అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ సివిల్ | 36 |
అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ | 10 |
డిప్యూటీ మేనేజర్ అగ్రికల్చర్ స్పెషలిస్ట్ | 10 |
రిలేషన్షిప్ మేనేజర్ (ఓఎంపీ) | 6 |
ప్రొడక్ట్ మేనేజర్ (ఓఎంపీ) | 2 |
అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్) | 4 |
సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ | 1 |
BEL Recruitment 2021: రూ.50,000 వరకు వేతనంతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో జాబ్స్
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 13
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 2
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 2
Jobs in Wipro: విప్రోలో ఫ్రెషర్స్‌కి 30,000 ఉద్యోగాలు... ఏడాదికి రూ.3,50,000 వేతనం
విద్యార్హతలు- నోటిఫికేషన్లో వెల్లడించిన సబ్జెక్ట్‌లో అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం ఇన్ రూరల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు పాస్ కావాలి. విద్యార్హతల వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.
వయస్సు- 25 నుంచి 25 ఏళ్ల వరకు
దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ.
వేతనం- రూ.78,000 వరకు
NIOT Recruitment 2021: రూ.78,000 వరకు వేతనంతో 237 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయితే చాలు
Step 1- అని విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://sbi.co.in/web/careers వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- కెరీర్స్ సెక్షన్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఉంటుంది.
Step 3- డిప్యూటీ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ పోస్టులకు వేర్వేరు దరఖాస్తు లింక్స్ ఉంటాయి.
Step 4- అప్లై చేయాలనుకునే పోస్టు లింక్ పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step 5- తర్వాత Click for New Registration పైన క్లిక్ చేయాలి.
Step 6- పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
Step 7- ఆ తర్వాత ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
Step 8- ఆ తర్వాత అభ్యర్థి అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
Step 9- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
Step 10- దరఖాస్తు ఫీజు పేమెంట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 11- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, Sbi, State bank of india