SBI Jobs: ఎస్‌బీఐ జాబ్‌కు దరఖాస్తు చేశారా? హాల్ టికెట్స్ వచ్చేశాయి

SBI SCO Admit Card 2019 | అక్టోబర్ 20న పరీక్ష జరగనుంది. ఎస్‌బీఐ ఎస్‌సీఓ 2019 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: October 10, 2019, 12:52 PM IST
SBI Jobs: ఎస్‌బీఐ జాబ్‌కు దరఖాస్తు చేశారా? హాల్ టికెట్స్ వచ్చేశాయి
SBI Jobs: ఎస్‌బీఐ జాబ్‌కు దరఖాస్తు చేశారా? హాల్ టికెట్స్ వచ్చేశాయి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 10, 2019, 12:52 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇటీవల రిలీజ్ చేసిన స్పెషల్ కేడర్ ఆఫీసర్-SCO ఉద్యోగానికి దరఖాస్తు చేసినవారికి శుభవార్త. ఈ ఎగ్జామ్‌కు హాల్ టికెట్లు రిలీజ్ చేసింది ఎస్‌బీఐ. మొత్తం 477 స్పెషల్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది ఎస్‌బీఐ. దరఖాస్తు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఇప్పుడు హాల్ టికెట్స్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 20న పరీక్ష జరగనుంది. ఎస్‌బీఐ ఎస్‌సీఓ 2019 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

SBI SCO Admit Card 2019: డౌన్‌లోడ్ చేయండి ఇలా...


ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ www.sbi.co.in ఓపెన్ చేయండి.

టాప్ రైట్ కార్నర్‌లో కెరీర్స్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
Latest Announcements సెక్షన్‌లో SCO నోటిఫికేషన్ ఓపెన్ చేయండి.
అందులో "Download Online Exam Call Letter" లింక్ పైన క్లిక్ చేయండి.


కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయాలి.
Loading...
హాల్ టికెట్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
పరీక్షకు వెళ్లే ముందు హాల్ టికెట్‌లోని ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: మొత్తం 3,500 పైగా రైల్వే జాబ్స్... ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేశారా?

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... 10వ తరగతి పాసైతే చాలు

ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
First published: October 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...