హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI Recruitment 2022: ఎస్‌బీఐ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే

SBI Recruitment 2022: ఎస్‌బీఐ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే

SBI Recruitment 2022: ఎస్‌బీఐ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Recruitment 2022: ఎస్‌బీఐ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

SBI Recruitment 2022 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో నోటిఫికేషన్ ద్వారా పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 47 ఖాళీలు ఉన్నాయి. 2022 అక్టోబర్ 31 లోగా అప్లై చేయాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాళీల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్లను (Retired Bank Officer) నియమించుకుంటోంది. మొత్తం 47 రిసాల్వర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 31 చివరి తేదీ. రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు కాబట్టి బ్యాంకింగ్ రంగంలో సేవలు అందించినవారే ఈ పోస్టులకు అప్లై చేయాలి. సదరు రిటైర్డ్ అధికారి 60 సంవత్సరాల వయస్సులో సూపర్‌యాన్యుయేషన్ పొందిన తర్వాత మాత్రమే బ్యాంక్ సర్వీస్ నుంచి రిటైర్ అయి ఉండాలి. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన, సస్పెండ్ చేయబడిన లేదా సూపర్‌యాన్యుయేషన్‌కు ముందు బ్యాంక్‌ని విడిచిపెట్టినవారు అర్హులు కాదు. ఈ జాబ్ నోటిఫికేషన్‍‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.

SBI Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే

 మొత్తం ఖాళీలు 47
 అమరావతి 2
 బెంగళూరు 6
 భోపాల్ 6
 హైదరాబాద్ 3
 జైపూర్ 2
 కోల్‌కతా 4
 లక్నో 4
 మహారాష్ట్ర 6
 ముంబై మెట్రో 2
 న్యూ ఢిల్లీ 5
 పాట్నా 5
 తిరువనంతపురం2

Bank of Baroda Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 ఉద్యోగాలు ... ఖాళీల వివరాలివే

SBI Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

విద్యార్హతలు- రిటైర్డ్ ఎస్‌బీఐ ఉద్యోగుల్ని ఈ పోస్టులకు తీసుకుంటున్నారు కాబట్టి విద్యార్హతల్ని వెల్లడించలేదు.

వయస్సు- 60 ఏళ్ల నుంచి 63 ఏళ్ల లోపు

వేతనం- నెలకు రూ.45,000 వరకు

ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ.

జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Railway Jobs: రైల్వేలో పరీక్ష లేకుండా 3115 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SBI Recruitment 2022: అప్లై చేయండి ఇలా

Step 1- అభ్యర్థులు ముందుగా https://sbi.co.in/web/careers వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

Step 2- ENGAGEMENT OF RETIRED BANK OFFICER నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.

Step 3- నోటిఫికేషన్ చదివిన తర్వాత Apply Online పైన క్లిక్ చేయాలి.

Step 4- Click for New Registration పైన క్లిక్ చేయాలి.

Step 5- ఆరు దశల్లో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మొదటి దశలో బేసిక్ వివరాలు ఎంటర్ చేయాలి.

Step 6- రెండో దశలో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

Step 7- మూడో దశలో అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

Step 8- నాలుగో దశలో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

Step 9- ఐదో దశలో అప్లికేషన్‌లోని వివరాలు సరిచూసుకోవాలి.

Step 10- ఆరో దశలో ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

Step 11- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

First published:

Tags: Bank Jobs, Bank Jobs 2022, JOBS, Sbi, State bank of india

ఉత్తమ కథలు