హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI Recruitment 2022: ఎస్బీఐ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

SBI Recruitment 2022: ఎస్బీఐ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (SBI Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (SBI Notification) విడుదల చేసింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 19 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నిన్న అంటే ఆగస్టు 31న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    ఖాళీల వివరాలు:

    S.Noవిభాగంఖాళీలు
    1.మేనేజర్ (Data Scientist - Specialist)11
    2.డిప్యూటీ మేనేజర్ (Data Scientist - Specialist) 5
    3.సిస్టం ఆఫీసర్3
    మొత్తం:19


    విద్యార్హతల వివరాలు: సంబంధిత విభాగాల్లో బీటెక్ ఎంటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. 60 శాతం మార్కులు పొంది ఉండాలి. అనుభవం, పూర్తి విద్యార్హతల తదితర వివరాల కోసం నోటిఫికేషన్ చూడొచ్చు.
    SBI SO Recruitment 2022: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ శుభవార్త.. 665 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి


    ఎలా అప్లై చేయాలంటే:
    Step 1: అభ్యర్థులు మొదటగా ఈ లింక్ (https://recruitment.bank.sbi/crpd-sco-2022-23-16/apply) ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో సూచించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
    Step 4: వివరాల నమోదు తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Bank Jobs, Job notification, Sbi, State bank of india

    ఉత్తమ కథలు