హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI Recruitment 2022: SBIలో డిగ్రీ అర్హతతో 1422 జాబ్స్.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ.. ఇలా అప్లై చేసుకోండి

SBI Recruitment 2022: SBIలో డిగ్రీ అర్హతతో 1422 జాబ్స్.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (SBI Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (SBI Job Notification) విడుదల చేసింది. మొత్తం 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో 1400 రెగ్యులర్ ఉద్యోగాలు కాగా.. మరో 22 బ్యాక్ లాగ్ లాగ్ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది స్టేట్ బ్యాంక్. అభ్యర్థులు sbi.co.in లేదా ibpsonline.ibps.in వెబ్ సైట్లలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నిన్నటి నుంచి (అక్టోబర్ 18) నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతల వివరాలు:

ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయో పరిమితి 21-30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్డ్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అయితే.. అభ్యర్థులకు విద్యార్హత పొందిన తర్వాత రెండేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏదైనా కమర్షియల్ లేదారా రీజినల్ రూరల్ బ్యాంక్ లో ఆఫీసర్ గా పని చేసిన అనుభవం ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

Bank Exams: బ్యాంక్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఇలా ప్రిపేర్‌ అయితే టాప్‌ స్కోర్‌ మీదే..!

రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు:

అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ , మణిపూర్ , మేఘాలయ, మిజోరాం , నాగాలాండ్ మరియు త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి 300 పోస్టులు ఉన్నాయి. దీని తరువాత, మహారాష్ట్ర మరియు గోవాకు 212, రాజస్థాన్‌కు 201, తెలంగాణకు 176, ఇంకా.. ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్/సిక్కిం/అండమాన్ మరియు నికోబార్ దీవులకు 175.. మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గడ్ కు 175 పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి.

ఎలా అప్లై చేయాలంటే?

Step 1: అభ్యర్థులు మొదటగా https://ibpsonline.ibps.in/sbicbosep22/ ఈ లింక్ ను ఓపెన్ చేయాలి.

Step 2: మొదటగా మీ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.

Step 3: రిజిస్ట్రేషన్ తర్వాత దరఖాస్తును పూర్తి చేయాలి.

Step 4: మీ భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

First published:

Tags: Bank Jobs 2022, JOBS, Sbi, Sbi jobs

ఉత్తమ కథలు