SBI RECRUITMENT 2022 642 JOBS IN STATE BANK OF INDIA SALARY RS 41000 HERE ARE THE DETAILS EVK
SBI Recruitment 2022: స్టెట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 642 ఉద్యోగాలు.. వేతనం రూ.41,000.. వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
SBI Recruitment 2022 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రిటైర్డ్ అధికారులను ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్, ఛానల్ మేనేజర్ సూపర్వైజర్, సపోర్ట్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ ప్రకటించారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 642 పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రిటైర్డ్ అధికారులను ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్, ఛానల్ మేనేజర్ సూపర్వైజర్, సపోర్ట్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ ప్రకటించారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 642 పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. దీని కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 7, 2022 వరకు అవకాశం ఉంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://sbi.co.in/web/careers/current-openings ను సంర్శించాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది.
ఖాళీ వివరాలు
ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్ – ఎప్పుడైనా ఛానెల్స్ (CMF-AC): 503 పోస్ట్‌లు
ఛానెల్ మేనేజర్ సూపర్వైజర్ ఎప్పుడైనా ఛానెల్‌లు (CMS-AC): 130 పోస్ట్‌లు
సపోర్ట్ ఆఫీసర్- ఎనీటైమ్ ఛానెల్స్ (SO-AC): 08 పోస్టులు
వీరికి ప్రాధాన్యత
- ATM కార్యకలాపాలలో పని అనుభవం ఉన్న రిటైర్డ్ సిబ్బందికి ప్రాధాన్యత ఇస్తారు. రిటైర్డ్ ఉద్యోగి స్మార్ట్ మొబైల్ ఫోన్‌ని కలిగి ఉండాలి.
- PC / మొబైల్ యాప్ / ల్యాప్‌టాప్ ద్వారా లేదా అవసరానికి అనుగుణంగా పర్యవేక్షించడానికి నైపుణ్యం/అప్టిట్యూడ్/నాణ్యత కలిగి ఉండాలి.
Step 2: అనంతరం Latest Announcements విభాగంలో నోటిఫికేషన్ కింద Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం Click here for New Registration ఆప్షన్ పై క్లిక్ చేసి కావాల్సిన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 4: అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్ తో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాలి.
Step 5: అప్లికేషన్ ఫామ్ ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.