• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • SBI RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR FIRE OFFICER JOBS IN STATE BANK OF INDIA NS

SBI Recruitment 2021: నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఖాళీలు, విద్యార్హతలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీర్(ఫైర్)/ఫైర్ ఆఫీసర్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 15న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆఖరి తేదీగా జూన్ 28ని నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.sbi.co.in/ ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 27 వరకు సైతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకిరించిన బ్యాంకు వివిధ కారణాలతో నిలిపివేసింది. మళ్లీ ఇప్పుడు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఎస్బీఐ.
    IBPS RRB 2021: రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,676 ఉద్యోగాలు... పరీక్ష సిలబస్ ఇదే
    ISRO online courses: ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులను అందించనున్న ఇస్రో.. దరఖాస్తు ఎలా చేయాలంటే..

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఫైర్ టెక్నాలజీ లేదా సేఫ్టీ ఇంజనీరింగ్ విభాగాల్లో BE/B.Tech అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. బీఎస్సీ(ఫైర్) అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఈ విద్యార్హతలను పొందిన వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Revised Notification - Direct Link
    Application - Direct Link

    దరఖాస్తు ఫీజు..
    జనరల్, EWS, OBC అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు. డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 27 వరకు అప్లికేషన్లను స్వీకరించిన సమయంలో అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు https://bank.sbi/web/careers లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజును ఇంటర్ నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: