బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి అతిపెద్ద శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI జాబ్ నోటిఫికేషన్ (Notification) రిలీజ్ చేసింది. ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2056 ఖాళీలను ప్రకటించింది. ఇందుల 2000 పోస్టులు రెగ్యులర్ నియామకం కాగా 56 బ్యాక్లాగ్ పోస్టులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 5, 2021 నుంచి అక్టోబర్ 25, 2021 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ (Online) పద్ధతిలో ఉంటుంది. అభ్యర్థిని ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ (Interview) ద్వారా ఎంపిక చేస్తారు. అర్హులైన వారికి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ (Pre Examination Training) నవంబర్ మధ్యవారంలో ఉంటుంది. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డిసెంబర్ 2021 మొదటి లేదా రెండో వారంలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు జాయిన్ అయ్యే సమయంలో రూ.2 లక్షల బాండ్ (Bond) రాసి ఇవ్వాలి. బాండ్ ప్రకారం అభ్యర్థులు కనీసం మూడేళ్లు బ్యాంకుకు సేవలు అందించాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు.
ఖాళీల వివరాలు ఇవే..
మొత్తం రెగ్యులర్ ఖాళీలు- 2000
ఎస్సీ- 300
ఎస్టీ- 150
ఓబీసీ- 540
ఈడబ్ల్యూఎస్ - 200
జనరల్- 810
మొత్తం బ్యాక్లాగ్ ఖాళీలు - 56
ఎస్సీ- 24
ఎస్టీ- 12
ఓబీసీ- 20
ముఖ్యమైన సమాచారం..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం | అక్టోబర్ 5, 2021 |
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ | అక్టోబర్ 25, 2021 |
దరఖాస్తు ఫీజు చెల్లింపు | అక్టోబర్ 5, 2021 నుంచి అక్టోబర్ 25, 2021 |
ప్రిలిమినరీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ | నవంబర్ 2021 |
ప్రిలిమనిరీ పరీక్ష | డిసెంబర్ 2021 మొదటి వారంలో |
మెయిన్ ఎగ్జామ్ | డిసెంబర్ 2021 చివరి వారంలో |
ఇంటర్వ్యూలు | ఫిబ్రవరి 2022 |
తుది ఫలితాలు | ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చ్ 2022 |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. |
అర్హతలు..
- అభ్యర్థి ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. 2020 డిసెంబర్ 31 లోపు డిగ్రీ పాస్ కావాలి.
- అభ్యర్థి వయసు 2020 ఏప్రిల్ 4 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
- పరీక్షా కేంద్రాలు : తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి.
పరీక్ష సెలబస్..
సెక్షన్ | టాపిక్స్ |
లాజికల్ రీజనింగ్ (Logical Reasoning) | ఆల్ఫాన్యూమరిక్ సిరీస్, ర్యాంకింగ్/డైరెక్షన్/, ఆల్ఫాబెట్ టెస్ట్, డేటా సఫిషియెన్సీ, కోడెడ్ అసమానతలు, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్, టాబులేషన్, సిలోజిజం, బ్లడ్ రిలేషన్స్, ఇన్పుట్-అవుట్‌పుట్, కోడింగ్-డీకోడింగ్ |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (Quantitative aptitude) | సింప్లికేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, మిక్చర్స్ అండ్ అలిగేషన్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సర్డ్స్, వర్క్ అండ్ టైమ్, టైమ్ అండ్ డిస్టాన్స్, సిలిండర్, కోన్, స్పియర్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సెంటేజ్, నంబర్ సిస్టమ్, సీక్వెన్స్ అండ్ సిరీస్, పెర్ముటేషన్, కాంబినేషన్ అండ్ ప్రాబబిలిటీ |
ఇంగ్లీష్ లాగ్వేజ్ (English Language) | రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్, సినోనిమ్ అండ్ ఆంటోనిమ్, ఇడియమ్స్ మరియు ఫ్రేజ్, వకాబులరీ టెస్ట్, ఫ్రేసల్ వర్బ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఫిల్ ఇన్ ద క్వాలిఫైయింగ్ వర్డ్స్ |
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి.
Step 2 : ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.sbi.co.in/careers లేదా https://bank.sbi/web/careers లను సందర్శించాలి.
Step 3 : అనంతరం Latest Announcements ఆప్షన్లో నోటిఫికేషన్ చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : నోటిఫికేష్‌లో ఇచ్చిన అప్లె లింక్‌పై క్లిక్ చేయండి.
Step 5 : దరఖాస్తు కోసం https://ibpsonline.ibps.in/sbiposasep21/ లింక్ తెరుచుకొంటుంది.
Step 6 : న్యూ రిజిస్టర్ అని ఆప్షన్ ఎంచుకొని పేరు, మొబైలన్ నంబర్, ఈ మెయిల్‌తో రిజిస్టర్ చేసుకోవాలి.
Step 7 : దరఖాస్తు పూర్తయిన తరువాత ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs 2021, Govt Jobs 2021, Job notification, JOBS