Home /News /jobs /

SBI RECRUITMENT 2020 STATE BANK OF INDIA RELEASED NOTIFICATION FOR 3850 POSTS 550 VACANCIES IN TELANGANA SS

SBI Jobs: డిగ్రీ అర్హతతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3850 ఉద్యోగాలు... తెలంగాణలోనూ ఖాళీలు


SBI Jobs: డిగ్రీ అర్హతతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3850 ఉద్యోగాలు... తెలంగాణలోనూ ఖాళీలు
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Jobs: డిగ్రీ అర్హతతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3850 ఉద్యోగాలు... తెలంగాణలోనూ ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)

SBI Recruitment 2020 | లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. 3850 ఖాళీల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

    బ్యాంకు ఉద్యోగం కోరుకుంటున్నవారికి శుభవార్త. బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 3850 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ సర్కిల్‌లోనూ ఖాళీలు ఉన్నాయి. గుజరాత్, తెలంగాణ సర్కిల్‌కు 550 ఖాళీలను ప్రకటించింది ఎస్‌బీఐ. తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో మొత్తం 3850 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 27న అంటే ఇవాళే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 16 చివరి తేదీ. డిగ్రీ అర్హతతో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/web/careers/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    Govt Jobs: సెబీలో 147 ఉద్యోగాలు... జూలై 31 లాస్ట్ డేట్

    CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 789 పోలీస్ ఉద్యోగాలు... మొదలైన దరఖాస్తు ప్రక్రియ

    SBI Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 3850
    తెలంగాణ- 550
    గుజరాత్- 750
    కర్నాటక- 750
    మధ్యప్రదేశ్- 296
    చత్తీస్‌గఢ్- 104
    తమిళనాడు- 55
    రాజస్తాన్- 300
    మహారాష్ట్ర- 517
    గోవా- 33

    Jobs: ఆర్మీ ఆస్పత్రిలో 300 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

    Railway Course: రైల్వే జాబ్ కోసం ఈ కోర్సులు చేయండి

    SBI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 27
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 16
    దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2020 ఆగస్ట్ 16
    దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 ఆగస్ట్ 31
    విద్యార్హత- ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత
    వయస్సు- 2020 ఆగస్ట్ 1 నాటికి 30 ఏళ్ల లోపు
    ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ,
    దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థుల రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank, Banking, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Sbi, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు