SBI Jobs: ఎస్‌బీఐలో 3850 జాబ్స్... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

SBI Jobs: ఎస్‌బీఐలో 3850 జాబ్స్... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

SBI Recruitment 2020 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 3850 పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇటీవల 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో రెండు వారాల సమయం ఉంది. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. తెలంగాణలోనే 550 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇతర పద్ధతుల్లో దరఖాస్తుల్ని ఎస్‌బీఐ స్వీకరించదు. దరఖాస్తు చేసే అభ్యర్థులకు పనిచేస్తున్న ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఉండాలి. వాటికే పరీక్షలు, కాల్ లెటర్స్, ఇతర వివరాల సమాచారం లభిస్తుంది. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తమకు అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఆ తర్వాత అప్లై చేయాలి.

    UPSC Jobs: మొత్తం 121 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... యూపీఎస్‌సీ నోటిఫికేషన్

    Jobs: యురేనియం కార్పొరేషన్‌లో 136 జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

    ఎస్‌బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసే ముందు అభ్యర్థులు రీసెంట్ ఫోటో, సంతకం, ఐడీ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్‌తో రెజ్యూమె, టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లను పీడీఎఫ్ రూపంలో సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటు ఎంబీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఐసీడబ్ల్యూఏ లాంటి ప్రొఫెషనల్ సర్టిఫికెట్, JAIIB/ CAIIB లాంటి సర్టిఫికెట్లు ఉంటే సిద్ధం చేసుకోవాలి. ఎక్స్‌పీరియరెన్స్ సర్టిఫికెట్, ఫామ్ 16 లాంటివి కూడా రెడీగా పెట్టుకోవాలి. అన్నీ స్కాన్ చేసి సిద్ధంగా ఉన్న తర్వాతే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభించాలి. లేకపోతే ఏ డాక్యుమెంట్ లేకపోయినా అప్లికేషన్ ప్రాసెస్‌ను మధ్యలోనే ఆపెయ్యాల్సి ఉంటుంది.

    Jobs: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ జాబ్ నోటిఫికేషన్... 510 ఉద్యోగాలు

    Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో 77 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    SBI Circle based officer Recruitment 2020, SBI Circle based officer application process, SBI Recruitment 2020, bank recruitment 2020, bank jobs 2020, sbi.co.in, SBI jobs, ఎస్‌బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2020, బ్యాంకు ఉద్యోగాలు 2020, బ్యాంక్ జాబ్స్ 2020, ఎస్‌బీఐ ఉద్యోగాలు 2020, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్స్
    ప్రతీకాత్మక చిత్రం


    ఇక అభ్యర్థులు ముందుగా https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Current Openings పైన క్లిక్ చేస్తే సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. నోటిఫికేషన్ చదివిన తర్వాత Apply లింక్ పైన క్లిక్ చేయాలి. మీ వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి. ఫోటోలు, డాక్యుమెంట్స్ అప్‍లోడ్ చేయాలి. ఒకసారి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసే అవకాశం ఉండదు. అందుకే వివరాలన్నీ సరిచూసుకోవాలి. చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించొచ్చు.

    Jobs: నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌లో 220 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత

    Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో 290 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

    దరఖాస్తు ఫామ్‌, పేమెంట్ రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‍వర్డ్ ఎక్కడైనా రాసిపెట్టుకోవాలి. ప్రింట్ తీసిన అప్లికేషన్ ఫామ్‌ను బ్యాంకుకు పంపాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ లేదా దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయడంలో ఏవైనా సమస్యలు 022-22820427 నెంబర్‌కు వర్కింగ్ డేస్ రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: