హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI Recruitment 2020-21: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

SBI Recruitment 2020-21: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

SBI Recruitment 2020-21: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Recruitment 2020-21: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

SBI Recruitment 2020-21 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే 8500 అప్రెంటీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. మరోవైపు 489 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫైర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 16 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 11 చివరి తేదీ. అభ్యర్థులు అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్లలోనే దరఖాస్తు చేయొచ్చు.

  7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్

  AAI Recruitment 2020: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 180 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  SBI Recruitment 2020-21: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


  ఫైర్ ఇంజనీర్ పోస్టులు మొత్తం- 16 (జనరల్-8, ఎస్సీ-2, ఎస్టీ-1, ఓబీసీ-4, ఈడబ్ల్యూఎస్-1)

  దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 22

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 11

  దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2021 జనవరి 11

  దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2021 జనవరి 31

  ఆన్‌లైన్ ఫీజు పేమెంట్- 2020 డిసెంబర్ 22 నుంచి 2021 జనవరి 11

  విద్యార్హత- ఫైర్ బ్రాంచ్‌లో బీటెక్ లేదా బీఈ

  ఇతర అర్హతలు- ఫిజికల్‌గా ఫిట్‌నెస్‌తో ఉండాలి. అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఫైర్ సేఫ్టీ నియమనిబంధనలు తెలిసి ఉండాలి. హైడ్రాంట్ సిస్టమ్, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్, స్ప్రింక్లర్ సిస్టమ్ లాంటి ఫైర్ ప్రివెన్షన్, ప్రొటెక్షన్ సిస్టమ్‌ నైపుణ్యం ఉండాలి.

  దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.

  BHEL Jobs 2020: బీహెచ్ఈఎల్‌లో జాబ్స్... దరఖాస్తుకు 4 రోజులే ఛాన్స్

  UPSC Recruitment 2020: 347 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్

  SBI Recruitment 2020-21: అప్లై చేయండి ఇలా


  అభ్యర్థులు https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Latest Announcments లో ఫైర్ మేనేజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఉంటుంది.

  అందులో Apply Online పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

  కొత్త పేజీలో Click for New Registration పైన క్లిక్ చేయాలి.

  పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి.

  ఆ తర్వాత స్టెప్‌లో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

  మూడో స్టెప్‌లో క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.

  నాలుగో స్టెప్‌లో ఓసారి దరఖాస్తులో సబ్మిట్ చేసిన వివరాలన్నీ సరిచూసుకోవాలి.

  చివరి స్టెప్‌లో పేమెంట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

  జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి.

  ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

  దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank, Banking, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Sbi, State bank of india

  ఉత్తమ కథలు