SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగం... ఏడాదికి రూ.80 లక్షల జీతం

SBI Recruitment 2019 | చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టుకు వార్షిక వేతనం రూ.80 లక్షలు ఆఫర్ చేస్తోంది ఎస్‌బీఐ. ఇక డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు వార్షిక వేతనం రూ.40.20 లక్షలు.

news18-telugu
Updated: February 9, 2019, 8:25 AM IST
SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగం... ఏడాదికి రూ.80 లక్షల జీతం
SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగం... ఏడాదికి రూ.80 లక్షల జీతం
news18-telugu
Updated: February 9, 2019, 8:25 AM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. గత నెలలో 44 పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ గడువు దగ్గరకొచ్చేసింది. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్(క్రెడిట్ రివ్యూ) పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఎస్‌బీఐ. ముంబై/నవీ ముంబైలో పోస్టింగ్ ఉంటుంది. ఈ పోస్టులను రెగ్యులర్, కాంట్రాక్ట్ బేసిస్‌లో ఎంపిక చేయనుంది ఆర్‌బీఐ. ఇక వీటితో పాటు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్‌ పోస్టులనూ భర్తీ చేయనుంది ఎస్‌బీఐ.

Read this: #Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2019 నోటిఫికేషన్ విడుదల... వివరాలివే

ఎస్‌బీఐలో ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ గత నెలలోనే ప్రారంభమైంది. ఫిబ్రవరి 11 లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసేవారి వయస్సు 2018 నవంబర్ 30 నాటికి 50 ఏళ్ల లోపు ఉండాలి. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్, ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్‌, ఐటీలో ఎంఎస్సీ, ఎంటెక్ చదివినవాళ్లు దరఖాస్తు చేయొచ్చు. ఐటీ రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి.

Read this: IRCTC Booking: రైలులో ఖాళీ సీట్ల లెక్క ఇలా తెలుసుకోండి



డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసేవారి వయస్సు 2018 నవంబర్ 30 నాటికి 50 ఏళ్ల లోపు ఉండాలి. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్, కంప్యూటర్ సైన్స్‌, ఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంసీఏ చదివి ఉండాలి. ఐటీ రంగంలో మొత్తం 18 ఏళ్లు, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ పొజిషన్‌లో 6 ఏళ్ల అనుభవం తప్పనిసరి. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టుకు వార్షిక వేతనం రూ.80 లక్షలు ఆఫర్ చేస్తోంది ఎస్‌బీఐ. ఇక డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు వార్షిక వేతనం రూ.40.20 లక్షలు.

Read this: Ombudsman Scheme: డిజిటల్ లావాదేవీలో మోసపోయారా? ఇలా కంప్లైంట్ చేయొచ్చు

ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్లు https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers ఓపెన్ చేసి ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. రెజ్యూమె, ఐడీ ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్, విద్యార్హతలు, ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

Photos: రూ.50 కోట్లతో 6 రోల్స్ రాయిస్ కార్లు... తలపాగాతో మ్యాచింగ్...


ఇవి కూడా చదవండి:

మీకు LIC నుంచి SMS వచ్చిందా? రాకపోతే ఇలా చేయండి...

Alert: ట్రాన్సాక్షన్స్‌లో ఈ 6 తప్పులు చేస్తే జరిమానా తప్పదు

SBI Alert: కార్డు మోసాలు జరుగుతున్నాయి... ఇలా జాగ్రత్తపడండి
First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...