ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868 రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేరకొన్నారు. రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. Business Correspondent Facilitator విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. 58 ఏళ్ల వయస్సు నిండి/30 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Post Office Jobs: రూ.63,200 వేతనంతో పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలు ... 10వ తరగతి పాసైతే చాలు
ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారికి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఇతర పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.
అప్లికేషన్ లింక్: LINK
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.