హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI Recruitment 2023: నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. 868 ఉద్యోగాలకు నోటిఫికేషన్

SBI Recruitment 2023: నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. 868 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868  రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్‌ ఖాళీలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేరకొన్నారు. రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. Business Correspondent Facilitator విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. 58 ఏళ్ల వయస్సు నిండి/30 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారికి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఇతర పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.

అప్లికేషన్ లింక్: LINK

First published:

Tags: Bank Jobs, State bank of india

ఉత్తమ కథలు