హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI PO Recruitment 2022: స్టేట్ బ్యాంక్ లో కొలువుల జాతర..1673 పీఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఈ రోజు నుంచే దరఖాస్తులు

SBI PO Recruitment 2022: స్టేట్ బ్యాంక్ లో కొలువుల జాతర..1673 పీఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఈ రోజు నుంచే దరఖాస్తులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టేట్ బ్యాంక్ ఇండియా (State Bank Of India) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. 1673 పీఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో జాబ్ అంటే యువతలో భారీ క్రేజ్ ఉంటుంది. ఈ బ్యాంకులో ఉద్యోగాలకు ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా పోటీ ఉంటుంది. అందుకే ఈ బ్యాంకులో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా లక్షలాది మంది నిరుద్యోగులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి తాజాగా శుభవార్త చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (SBI PO Notification) విడుదల చేసింది. మొత్తం 1673 పీఓ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు గాను ఇందులో రెగ్యులర్ పోస్టులు 1600 ఉండగా.. బ్యాక్‌లాగ్ పోస్టులు మరో 73 వరకు ఉన్నాయి.

  కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు..

  ఎస్సీ270
  ఎస్టీ131
  ఓబీసీ464
  ఈడబ్ల్యూఎస్‌160
  యూఆర్‌648
  మొత్తం: 1643

  విద్యార్హతలు:

  ఈ ఉద్యోగాలకు విద్యార్హతను డిగ్రీగా నిర్ణయించారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి డిగ్రీ విద్యార్హత పొందిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయస్సు ఏప్రిల్ 1, 2022 నాటికి 21-30 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

  ముఖ్యమైన తేదీలు:

  ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే సెప్టెంబర్ 22న ప్రారంభం కాగా.. దరఖాస్తుకు ఆఖరి తేదీగా అక్టోబర్ 12ను నిర్ణయించారు.

  SBI Recruitment: బ్యాంక్ జాబ్స్‌కు ప్రిపేర్ అయ్యేవారికి గుడ్‌న్యూస్.. ఎస్‌బీఐ నుంచి భారీ నోటిఫికేషన్..!

  ముఖ్యమైన తేదీలు:

  దరఖాస్తుల ప్రక్రియ: 22.09.2022 నుంచి 12.10.2022

  అప్లికేషన్ ఫీజు చెల్లింపు: 22.09.2022 నుంచి 12.10.2022

  ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్స్ డౌన్ లోడ్: డిసెంబర్ 2వ వారం నుంచి..

  ఫేజ్-I: ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్: డిసెంబర్ 17,18, 19, 20

  ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: డిసెంబర్ 2022 / జనవరి 2023

  మెయిన్స్ పరీక్ష కాల్ లెటర్లు: జనవరి 2023 / ఫిబ్రవరి 2023

  ఫేజ్-II: ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్: జనవరి 2023 / ఫిబ్రవరి 2023

  మెయిన్స్ ఎగ్జామ్ ఫలితాలు: ఫిబ్రవరి 2023

  ఫేజ్-III కాల్ లెటర్లు: ఫిబ్రవరి 202

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bank Jobs, JOBS, Sbi, State bank of india

  ఉత్తమ కథలు