బ్యాంకు ఉద్యోగాలు (Bank Jobs) కోరుకునేవారికి అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా 2056 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డిగ్రీ పాస్ అయినవారు, చివరి సంవత్సరం చదువుతున్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 25 చివరి తేదీ. నవంబర్ లేదా డిసెంబర్లో ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, డిసెంబర్లో ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్, 2022 ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు ఉంటాయి. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి. మరి ఈ పోస్టులకు విద్యార్హతల వివరాలేంటీ? ఏం చదవాలి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? తెలుసుకోండి.
Educational Qualifications: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సు పాస్ కావాలి. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. 2021 డిసెంబర్ 31 లోగా డిగ్రీ పూర్తి చేసినట్టు ఇంటర్వ్యూ సమయంలో ప్రూఫ్ చూపించాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయెల్ డిగ్రీ చదువుతున్నవారు ఐడీడీ 2021 డిసెంబర్ 31 లోగా పాస్ అయినట్టు సర్టిఫికెట్ చూపించాలి. చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ లాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవారు కూడా అప్లై చేయొచ్చు.
Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... రైల్వేలో 2,945 ఉద్యోగాలు
Online Preliminary Examination: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో 100 మార్కులకు ఆబ్జెక్టీవ్ టెస్ట్ ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కు 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. సమయం 20 నిమిషాలు. క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్కు 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. సమయం 20 నిమిషాలు. రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. సమయం 20 నిమిషాలు.
Online Main Examination: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినవారిని మెయిన్ ఎగ్జామ్‌కు పిలుస్తారు. ఖాళీల సంఖ్య కన్నా 10 రెట్ల అభ్యర్థులు మెయిన్ ఎగ్జామ్‌కు క్వాలిఫై అవుతారు. ఈ నోటిఫికేషన్‌కు 20560 మంది అభ్యర్థులు మెయిన్స్ రాస్తారు. మెయిన్ ఎగ్జామ్‌లో 200 మార్కులకు ఆబ్జెక్టీవ్ టెస్ట్, 50 మార్కులకు డిస్క్రిప్టీవ్ టెస్ట్ ఉంటుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. సమయం 60 నిమిషాలు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 35 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. సమయం 45 నిమిషాలు. జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. సమయం 35 నిమిషాలు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. సమయం 40 నిమిషాలు. మొత్తం 155 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. సమయం 3 గంటలు. డిస్క్రిప్టీవ్ టెస్ట్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్, ఎస్సేపై 50 మార్కులకు రెండు ప్రశ్నలు ఉంటాయి.
Interview: మెయిన్స్ క్వాలిఫై అయినవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. లేదా ఇంటర్వ్యూ 30 మార్కులు, గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయినవారు ఫైనల్ సెలెక్షన్‌కు ఎంపికౌతారు.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS