డిగ్రీ పాస్ అయినవారికి అలర్ట్. డిగ్రీ పాస్ అయినవారు మాత్రమే కాదు... డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా చివరి సెమిస్టర్ చదువుతున్నవారికీ గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2056 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు కొద్ది రోజుల క్రితం జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. డిగ్రీ అర్హతతో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తుండటం నిరుద్యోగులకు శుభవార్తే. డిగ్రీ చివరి సెమిస్టర్, ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. అయితే ఇంటర్వ్యూ సమయానికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 అక్టోబర్ 25 లాస్ట్ డేట్. దరఖాస్తు విధానం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఎంపిక విధానం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్‌తో పాటు, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 2056 |
రెగ్యులర్ | 2000 |
బ్యాక్లాగ్ వేకెన్సీ | 56 |
దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 25
ఫీజు చెల్లింపు- 2021 అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 25
ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్‌లెటర్స్ డౌన్లోడ్- 2021 నవంబర్ మొదటి వారం లేదా రెండో వారం
ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్- 2021 నవంబర్ లేదా డిసెంబర్
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాల విడుదల- 2021 డిసెంబర్
మెయిన్ ఎగ్జామినేషన్ కాల్‌లెటర్స్ డౌన్లోడ్- 2021 డిసెంబర్ రెండోవారం లేదా మూడోవారం
ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్- 2021 డిసెంబర్
మెయిన్ ఎగ్జామినేషన్ ఫలితాల విడుదల- 2022 జనవరి
ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ డౌన్లోడ్- 2022 ఫిబ్రవరి మొదటివారం లేదా రెండోవారం
ఇంటర్వ్యూ- 2022 ఫిబ్రవరి రెండోవారం లేదా మూడోవారం
తుది ఫలితాల విడుదల- 2022 ఫిబ్రవరి లేదా మార్చి
Railway Jobs 2021: దక్షిణ మధ్య రైల్వేలో 4,103 ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి
విద్యార్హతలు- కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేయొచ్చు. 2021 డిసెంబర్ 31 నాటికి గ్రాడ్యుయేషన్ పాస్ అయినట్టు ఇంటర్వ్యూలో ప్రూఫ్ చూపించాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయెల్ డిగ్రీ సర్టిఫికెట్ ఉన్న విద్యార్థులు 2021 డిసెంబర్ 31 ఐడీడీ పాస్ కావాలి. చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు- 2021 ఏప్రిల్ 1 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. అంటే అభ్యర్థులు 1991 ఏప్రిల్ 2 నుంచి 2000 ఏప్రిల్ 1 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs 2021, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, State bank of india